కళ్లద్దాలపై గీతలా...
ABN , Publish Date - May 21 , 2026 | 04:22 AM
కళ్లకు పెట్టుకునే పవర్ గ్లాస్‌లు, సన్ గ్లాస్‌లపై చిన్న చిన్న గీతలను ఎలా తగ్గించాలో చూద్దాం....
కళ్లకు పెట్టుకునే పవర్ గ్లాస్‌లు, సన్ గ్లాస్‌లపై చిన్న చిన్న గీతలను ఎలా తగ్గించాలో చూద్దాం.
పలుచని చేతి రుమాలుపై తెల్లటి టూత్ పేస్టును కొద్దిగా తీసుకుని దానితో అద్దాలపై ఉన్న గీతల మీద గుండ్రంగా రుద్దాలి. ఆపైన నీటితో కడిగి మైక్రో ఫైబర్ క్లాత్‌తో తుడిచేస్తే గీతలు చాలావరకు తగ్గి అద్దాలు బాగా కనిపిస్తాయి.
గిన్నెలో చెంచా బేకింగ్ సోడా వేసి కొన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని అద్దాలపై రాసి చేత్తో మెల్లగా రుద్ది కడగాలి. తరువాత మెత్తటి తువాలుతో తుడిచేస్తే అద్దాలు కొత్తగా మెరుస్తాయి.
కొద్దిగా బేబీ ఆయిల్ లేదా వైట్ పెట్రోలియం జెల్లీని అద్దాలపై రాసి మైక్రో ఫైబర్ క్లాత్‌తో తుడిచేస్తే గీతలు కనిపించవు.
అద్దాలపై కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్ రాసి గోరువెచ్చటి నీటితో కడిగి తుడవాలి. దీంతో అద్దాలు చక్కగా మెరుస్తూ గీతలు తగ్గినట్లు కనిపిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి
శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..