నల్ల మచ్చలు పోయేదెలా..?
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:58 AM
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, మొటిమల కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని సులువుగా తగ్గించే ఇంటి చిట్కాలివే...
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, మొటిమల కారణంగా ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని సులువుగా తగ్గించే ఇంటి చిట్కాలివే...
చిన్న నిమ్మకాయంత సైజు చింతపండును తీసుకుని వేడినీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి. అందులో కొద్దిగా రోజ్‌వాటర్, రెండు చెంచాల ముల్తాని మట్టి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే నల్లమచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.
చిన్న గిన్నెలో రెండు చెంచాల పసుపు, చెంచా తేనె, చెంచా పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావు గంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే క్రమంగా మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
ఒక గిన్నెలో రెండు చెంచాల నిమ్మరసాన్ని తీసుకుని అందులో నాలుగు చెంచాల మంచినీళ్లు కలపాలి. అందులో చిన్న దూది ఉండను ముంచి దానితో ముఖమంతా సున్నితంగా రుద్దాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నిమ్మరసానికి బదులు యాపిల్ సైడర్ వెనిగర్ వాడినా ప్రయోజనం కనిపిస్తుంది.
కలబంద గుజ్జును తీసుకుని ముఖంపై నల్ల మచ్చలు ఉన్నచోట మందంగా పట్టించాలి. పావుగంట తరువాత సున్నితంగా మర్దన చేసి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే నల్లమచ్చలు మాయమవుతాయి.
పెరుగు, తేనెల మిశ్రమం లేదా బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు