Share News

వేసవిలో జుట్టు రాలడాన్ని ఆపేదెలా..?

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:04 AM

వేసవి ప్రారంభంలో వాతావరణ మార్పుల కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇది సాధారణ ప్రక్రియే అయినప్పటికీ...

వేసవిలో జుట్టు రాలడాన్ని ఆపేదెలా..?

వేసవి ప్రారంభంలో వాతావరణ మార్పుల కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. ఇది సాధారణ ప్రక్రియే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.

  • ఎండ వేడి పెరిగే కొద్దీ శరీరం తేమను కోల్పోతూ ఉంటుంది. దీంతో కుదుళ్లు బలహీనమై శిరోజాలు రాలిపోతుంటాయి. అలాంటప్పుడు తరచూ గోరువెచ్చటి బాదం నూనె లేదా కొబ్బరి నూనెను తలకు మర్దన చేస్తూ ఉంటే కుదుళ్లకు రక్తప్రసరణ పెరిగి శిరోజాలు బలం పుంజుకుంటాయి.

అలాగే మంచినీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.

  • ఎ, బి, సి, డి విటమిన్లతోపాటు ఐరన్‌, జింక్‌, ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్యమైన పోషకాహరం శిరోజాలకు మంచి పోషణను అందిస్తుంది.

  • హెయిర్‌ స్టయిల్‌ అంటూ జుట్టును గట్టిగా బిగించి రబ్బర్‌ బ్యాండ్లు వేయడం, పిన్నులు పెట్టడం లాంటివి చేయకూడదు. శిరోజాలను మృదువుగా దువ్వి లూజుగా ఉండే హెయిర్‌ స్టయిల్స్‌ను ప్రయత్నించాలి.

  • హెయిర్‌ డ్రైయర్‌, హెయిర్‌ స్ట్రైటెనర్‌లు శిరోజాలను పెళుసుగా మార్చి బలహీనపరుస్తాయి. వీటిని వాడకపోవడమే మంచిది.

  • తడి జుట్టును హడావిడిగా దువ్వడం, చిక్కు తీయడం లాంటివి చేయకూడదు. జుట్టు పొడిగా ఆరిన తరువాతనే మెల్లగా దువ్వి జడ వేసుకోవాలి.

  • శిరోజాలను ఎక్కువ వాల్యూమ్‌లో కనిపించేలా చేస్తాయంటూ గాఢమైన రసాయనాలు ఉన్న షాంపూలు, కండిషనర్లు వాడకూడదు. సాధ్యమైనంత వరకు తేలికపాటి షాంపూలు, ఆర్గానిక్‌ ఉత్పత్తులను మాత్రమే వాడాలి.

  • శిరోజాలకు ఎండ తగలకుండా స్కార్ప్‌ లేదా టోపీ ధరించాలి. బయటకు వెళ్లేటప్పుడు హెయిర్‌ సన్‌స్ర్కీన్‌ను మితంగా వాడవచ్చు.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

Updated Date - Mar 04 , 2026 | 01:04 AM