పెరుగు పులవకుండా
ABN , Publish Date - May 04 , 2026 | 01:44 AM
ఎండలు మండిపోయే ఈ వేసవిలో పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే, ఈ సమ్మర్‌లో వేధించే ప్రధాన సమస్య పెరుగు...
ఎండలు మండిపోయే ఈ వేసవిలో పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే, ఈ సమ్మర్‌లో వేధించే ప్రధాన సమస్య పెరుగు త్వరగా పులిసిపోవడం. పెరుగు ఎప్పుడూ తీయగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పెరుగు తోడుకోవడానికి పాలవేడి చాలా ముఖ్యం. వేసవిలో వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి పాలను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. గోరువెచ్చని పాలలో తోడు వేయాలి. పాలు మరీ వేడిగా ఉంటే పెరుగు నీళ్లలా మారిపోతుంది. చల్లగా ఉంటే తోడుకోదు.
పెరుగు తోడుకున్న వెంటనే అందులో చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేయండి. ఇలా చేస్తే రెండుమూడు రోజుల వరకు పెరుగు పులవకుండా తాజాగా ఉంటుంది.
స్టీలు గిన్నెల కంటే మట్టిపాత్రలోని పెరుగు త్వరగా పులిసిపోదు. మట్టిపాత్రలో ఉండే సూక్ష్మ రంధ్రాలు పెరుగులోని అదనపు తేమను పీల్చుకుని తాజాగా ఉంచుతుంది.
ఒక్కోసారి తోడు దొరకనప్పుడు గోరువెచ్చని పాలలో రెండు ఎండుమిరపకాయలు తొడిమలు సహా వేయండి. మిర్చిలోని ఎంజైములు పాలను పెరుగ్గా మారుస్తాయి.
పెరుగు తోడుకున్న వెంటనే దానిని బయట ఉంచకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి. బయట ఉంటే గాలిలోని వేడికి కిణ్వ ప్రక్రియ వేగవంతమై త్వరగా పులిసిపోతుంది.
పెరుగుపైన తేరుకున్న నీటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే కూడా పెరుగు త్వరగా పులిసిపోకుండా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి
బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి