పిల్లలు నీళ్లు తాగట్లేదా?
ABN , Publish Date - May 21 , 2026 | 04:25 AM
దాహమేస్తే తప్ప పిల్లలు నీరు తాగరు. దీంతో డీ హైడ్రేషన్ సమస్యలు రావచ్చు. తరచూ పిల్లలు ఇష్టంగా నీరు తాగాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి...
దాహమేస్తే తప్ప పిల్లలు నీరు తాగరు. దీంతో డీ హైడ్రేషన్ సమస్యలు రావచ్చు. తరచూ పిల్లలు ఇష్టంగా నీరు తాగాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి...
ఆకర్షణీయమైన రంగుల్లో చక్కని డిజైన్లలో ఉండే వాటర్ బాటిల్స్‌లో మంచినీటిని నింపి ఇస్తే వాటిని చూడగానే పిల్లలు నీరు తాగాలనుకుంటారు.
వెడల్పాటి గిన్నెలో మంచినీటిని తీసుకుని అందులో సన్నగా తరిగిన నిమ్మకాయ, స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ తొనలు, సన్నగా తరిగిన అల్లం, పుదీనా, తులసి ఆకులు లాంటివి వేసి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. రుచికరంగా సువాసనభరితంగా తయారైన ఈ ఇన్ఫ్యూజ్డ్ నీటిని వడబోసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు.
పారదర్శకంగా కనిపించే వాటర్ బాటిల్స్‌లో సబ్జా గింజలు లేదా చియా సీడ్స్ వేసి నిండా మంచినీటిని నింపి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఆ బాటిల్స్‌ను వేగంగా ఊపి ఇస్తే పిల్లలు తేలియాడే గింజలను చూస్తూ ఆసక్తిగా నీటిని తాగుతారు.
రోజుకు ఎంత నీరు తాగాలో పిల్లలకు వివరించి చెప్పి అలారాన్ని సెట్ చేయాలి. అలారం మొగినప్పుడల్లా నీరు తాగాలనే నిబంధన పెట్టి పిల్లలు దాన్ని పాటించేలా చూడాలి. అప్పుడే పిల్లలు సమయానికి నీరు తాగడం నేర్చుకుంటారు
మంచినీటి గ్లాసుల్లో రంగురంగుల ఫన్నీ స్ట్రాలు వేసిస్తే వాటి ద్వారా పిల్లలు ఇష్టంగా నీరు తాగుతారు.
ఈ వార్తలు కూడా చదవండి
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి
శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..