కొబ్బరి పాలు తయారుచేద్దాం
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:27 AM
స్వీట్లు, గ్రేవీ కూరలు, పులావ్ తదితర వంటకాల్లో విరివిగా ఉపయోగించే కొబ్బరి పాలను ఇంట్లోనే సులువుగా ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం...
స్వీట్లు, గ్రేవీ కూరలు, పులావ్ తదితర వంటకాల్లో విరివిగా ఉపయోగించే కొబ్బరి పాలను ఇంట్లోనే సులువుగా ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం...
గ్రైండింగ్ మెథడ్
కొబ్బరి వెనక ఉన్న గోధుమ రంగు పొరను చాకుతో తీసేయాలి. తరువాత చిన్నముక్కలుగా కోయాలి. వీటిని మిక్సీలో వేసి మూడు కప్పుల గోరువెచ్చటి నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి వడకట్టి పిప్పిని చేత్తో గట్టిగా పిండాలి. అంతే! చిక్కటి కొబ్బరి పాలు రెడీ!
ఈ పిప్పిని మరోసారి మిక్సీలో వేసి ఓ కప్పు గోరువెచ్చటి నీటిని పోసి అయిదు నిముషాలు గ్రైండ్ చేసి వడబోస్తే మరికొన్ని కొబ్బరి పాలు వస్తాయి.
గ్రేటింగ్ మెథడ్
పచ్చి కొబ్బరిని తురిమి పలుచని గుడ్డలో వేసి మూటలా కట్టి గట్టిగా పిండితే చిక్కటి పాలు వస్తాయి.
మిగిలిన పిప్పిని అరగంటసేపు గోరువెచ్చటి నీటిలో నానబెట్టి మరోసారి గుడ్డలో మూటకట్టి పిండితే మరికొన్ని కొబ్బరిపాలు వస్తాయి. ఇలా రెండు లేదా మూడుసార్లు చేయవచ్చు. ఇవి కాస్త పలుచగా ఉంటాయి.
ఇలా వాడాలి..
చిక్కటి పాలను డెజర్ట్స్, స్మూతీలు, గ్రేవీ కూరల తయారీలో ఉపయోగించాలి. పలుచటి పాలను పులావ్, కొబ్బరి అన్నం, కూర్మాలు, సూప్‌ల తయారీలో వాడవచ్చు.
జాగ్రత్తలు
ఇంట్లో తయారుచేసిన కొబ్బరిపాలను గాలి చొరబడని కంటైనర్లో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. కానీ వీలైనంత త్వరగా వాడేయడం మంచిది. వాసన, రంగుల్లో మార్పు కనిపిస్తే ఆ పాలను వాడకూడదు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్