మీ వార్డ్‌రోబ్ మెరిసిపోవాలా?
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:50 AM
మన దగ్గర ఎన్ని ఖరీదైన బట్టలు ఉన్నాయన్నది కాదు, వాటిని ఎంత జాగ్రత్తగా మెయింటెన్ చేస్తున్నామన్నదే ముఖ్యం.చిన్నపాటి జాగ్రత్తలు...
మన దగ్గర ఎన్ని ఖరీదైన బట్టలు ఉన్నాయన్నది కాదు, వాటిని ఎంత జాగ్రత్తగా మెయింటెన్ చేస్తున్నామన్నదే ముఖ్యం.చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పాత దుస్తులను కూడా కొత్తవాటిలా తళతళలాడేలా చేయొచ్చు. ఫ్యాషన్ ప్రపంచంలో ‘క్లాసీ’గా కనిపించడానికి మీకు ఉపయోగపడే చిట్కాలు.
చాలామంది మహిళలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య.. బీరువా నిండా బట్టలున్నా, బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ‘ఏం వేసుకోవాలో అర్థం కాకపోవడం’. దీనికి పరిష్కారం ‘వార్డ్‌రోబ్ ఆర్గనైజేషన్’. ముందుగా మీ దుస్తులను కేటగిరీల వారీగా విభజించండి. ఆఫీ్‌సవేర్, పార్టీవేర్, క్యాజువల్ వేర్ అని వేర్వేరుగా సర్దుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది.
దుస్తుల రంగులు వెలిసిపోకుండా ఉండాలంటే వాటిని ఉతికేటప్పుడు తిరగేసి ఉతకడం మంచిది. ముఖ్యంగా ముదురు రంగు దుస్తులు, జీన్స్ వంటివి ఎండలో నేరుగా ఆరేయకుండా నీడలో ఆరబెడితే రంగులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
పట్టుచీరలు, ఖరీదైన వర్క్ ఉన్న డ్రెస్సుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. వీటిని ప్లాస్టిక్ కవర్లలో కాకుండా, కాటన్ వస్త్రంలో లేదా మస్లిన్ క్లాత్‌లో చుట్టి ఉంచాలి. దీనివల్ల గాలి తగిలి వస్త్రం పాడవకుండా ఉంటుంది.
వార్డ్‌రోబ్‌లో తేమ చేరి దుర్వాసన రాకుండా ఉంటాలంటే ఎండు వేపాకులు లేదా సిలికా జెల్ పౌచ్‌లను ఉంచడం ఒక స్మార్ట్ ఐడియా
దుస్తుల ఎంపికలో కూడా కొన్ని మెళకువలు పాటించాలి. ప్రతి సీజన్‌కు కొత్తవి కొనక్కర్లేకుండా ‘మిక్స్ అండ్ మ్యాచ్’ పద్ధతిని వాడండి. ఉదా: ఒక పాత కుర్తా పైకి కొత్త దుపట్టా లేదా జాకెట్ వేయడం ద్వారా కొత్త లుక్ ఇవ్వొచ్చు.
దుస్తుల ఫిటింగ్ అనేది మీ లుక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఎంత ఖరీదైన డ్రెస్ అయినా సరే, అది మీకు పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయితేనే అందం. చిన్నపాటి చిరుగులు లేదా గుండీలు ఊడిపోయినప్పుడు వెనువెంటనే బాగు చేయించుకోవడం వల్ల వాటి జీవితకాలం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, సరైన ఆహార్యం మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది.
ఇవి కూడా చదవండి...
ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?
Read Latest Telangana News And Telugu News