Share News

వేసవిలో పెరుగు తాజాగా...

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:53 AM

ఎండాకాలంలో పెరుగు త్వరగా పులుపెక్కుతూ ఉంటుంది. అలాకాకుండా ఎక్కువసేపు పెరుగును కమ్మగా ఉంచే చిట్కాలివే...

వేసవిలో పెరుగు తాజాగా...

ఎండాకాలంలో పెరుగు త్వరగా పులుపెక్కుతూ ఉంటుంది. అలాకాకుండా ఎక్కువసేపు పెరుగును కమ్మగా ఉంచే చిట్కాలివే...

  • పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారాక తోడు పెట్టాలి. తోడు కోసం ఎక్కువ పెరుగును కలపకూడదు. అరలీటరు పాలకు అర చెంచా పెరుగు కలిపితే చాలు. అప్పుడే పాలు మెల్లగా తోడుకుంటాయి. పెరుగు కూడా ఎక్కువసేపు కమ్మగా ఉంటుంది.

  • తోడు పెట్టిన తరువాత పాల గిన్నెను కిచెన్‌లో స్టవ్‌ పక్కన లేదంటే ఎండ తగిలే ప్రదేశంలో ఉంచకూడదు. చల్లగా ఉండే ప్రదేశంలో లేదంటే ఇన్సులేటెడ్‌ క్యాస్‌రోల్‌లో ఉంచడం వల్ల పెరుగు నెమ్మదిగా తోడుకుంటుంది. త్వరగా పాడైపోదు.

  • పాలను స్టీల్‌ గిన్నెలో కాకుండా మట్టి పాత్రలో పోసి తోడు పెడితే గడ్డ పెరుగు తయారవుతుంది. ఇది త్వరగా పులుపెక్కదు. మట్టి పాత్ర సహజంగానే తేమను పీల్చుకుని పెరుగును తాజాగా ఉంచుతుంది.

  • పాలు తోడు పెట్టిన తరువాత అందులో ఒక పచ్చి మిరపకాయను తొడిమతో సహా వేస్తే పెరుగు కమ్మగా తయారవుతుంది.

  • పెరుగు గిన్నె మీద మూత సరిగా అమరేలా చూసుకోవాలి. గిన్నెలో తడి చెంచాలు, గరిటెలు ఉంచకూడదు.

  • పెరుగు తోడుకుని గడ్డకట్టిన వెంటనే ఫ్రిజ్‌లో పెడితే రోజంతా తాజాగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మాత్రం గంట గంటకూ పులిసి పెరుగు పాడైపోతుంది.

  • మధ్యాహ్నానికి కావాల్సిన పెరుగు కోసం రాత్రి పూట, రాత్రికి కావాల్సిన పెరుగు కోసం ఉద యాన్నే పాలు తోడు పెట్టడం మంచిది.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 01:53 AM