కల్తీ కనిపెడదాం!
ABN , Publish Date - May 12 , 2026 | 04:12 AM
ముంబయిలో ఒక కుటుంబం మరణానికి పుచ్చపండు కారణమనే వార్తలు వెలువడడంతో ప్రజల్లో ఈ వేసవి పండు పట్ల పలురకాల భయాలు, అనుమానాలు పెరిగిపోయాయి....
అవగాహన
ముంబయిలో ఒక కుటుంబం మరణానికి పుచ్చపండు కారణమనే వార్తలు వెలువడడంతో ప్రజల్లో ఈ వేసవి పండు పట్ల పలురకాల భయాలు, అనుమానాలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఎవరికి వారు సురక్షితమైన పుచ్చపండును ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడం అవసరం.
ఉపరితలం మెరవకూడదు. పండు బరువుగా ఉండాలి. ఎక్కువ మెరుపుతో, ఉపరితలం మీద పొడిని పోలిన పదార్థం కనిపిస్తే ఆ పండుకు దూరంగా ఉండాలి
పుచ్చపండు మీద పసుపుపచ్చని మచ్చ కోసం వెతకాలి. పుచ్చకాయ నేల మీద సహజసిద్ధంగా పండిందనడానికి ఈ మచ్చ ప్రధాన గుర్తు. పుచ్చకాయ మీదున్న మచ్చ తెల్లగా ఉన్నా, మచ్చే లేకపోయినా ఆ పుచ్చకాయ కొనకూడదు. అలాగే కొన్ని పుచ్చకాయల మీద సాలెగూడును పోలిన గుర్తులుంటాయి. సహజసిద్ధ పరాగసంపర్కానికి ఈ మచ్చ ఒక గుర్తు
పుచ్చ మక్కల మీద టిష్యూతో అద్దినప్పుడు ముదురు ఎరుపు రంగు మచ్చ ఏర్పడితే దాన్నొక హెచ్చరిక సంకేతంగా భావించాలి
పుచ్చ ముక్కను నీళ్లలో వేసి చూడండి. నీళ్లు వెంటనే ముదురు ఎరుపు రంగులోకి మారితే కృత్రిమ రంగులు జోడించినట్టు అర్ధం
ఆరోగ్యకరమైన పుచ్చపండు విత్తనాలు ముదురు గోధుమరంగు లేదా నలుపు రంగులో ఉంటాయి. పాలిపోయిన విత్తనాలు నాణ్యతలేని పండుకు సూచన
కోసే ముందు పుచ్చకాయను శుభ్రంగా కడగాలి.
ఈ వార్తలనూ చదవండి:
ధరలను పెంచే యోచనలో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు.. నిత్యావసరాలు మరింత ప్రియం
అంతర్జాతీయ అనిశ్చితులు.. పసిడి ధరల్లో కోత