పిల్లల్ని ఇలా నిద్ర పుచ్చాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:15 AM
చిన్న పిల్లలు రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం...
చిన్న పిల్లలు రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం...
పిల్లల నిద్రకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేయాలి.
బడి నుంచి రాగానే లేదా సాయంత్రం వేళ కొద్దిసేపు ఆరుబయట ఆడుకోనివ్వాలి. సైక్లింగ్, దగ్గరలో ఉన్న పార్క్‌లో నడవడం అలవాటు చేయవచ్చు. తరువాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాలి.
రాత్రి భోజనాన్ని త్వరగా తినిపించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని పెట్టాలి.
పడుకునేముందు గోరువెచ్చటి పాలను తాగించాలి. చిన్న చిన్న కథలు చెబుతూ వారిని నిద్రకు సిద్దం చేయాలి.
పడుకునే సమయానికి గంట ముందు నుంచే టీవీ, మొబైల్ చూడనివ్వకూడదు.
పిల్లలు పడుకునే గది చీకటిగా ప్రశాంతంగా ఉండేలా చూడాలి.
సమయం దాటినప్పటికీ పడుకోకుండా అల్లరి చేస్తుంటే కోప్పడకూడదు. మృదు స్వరంతో నచ్చచెబితే మాట వింటారు.
ఉదయాన్నే నిద్ర లేపితే పిల్లలు రాత్రిపూట త్వరగా పడుకుంటారు. పది పన్నెండు గంటలు నిద్రించేలా చూడాలి.
ఈ వార్తలనూ చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన