Share News

మీగడ మందంగా...

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:37 AM

ఒక్కోసారి పాలను ఎంత మరిగించినప్పటికీ మీగడ అనుకున్నవిధంగా రాదు. మరి మీగడ మందంగా రావాలంటే..!...

మీగడ మందంగా...

ఒక్కోసారి పాలను ఎంత మరిగించినప్పటికీ మీగడ అనుకున్నవిధంగా రాదు. మరి మీగడ మందంగా రావాలంటే..!

  • ముందుగా చిక్కటి పాలు లేదంటే ఫుల్‌ క్రీం పాలను మందపాటి గిన్నెలో పోసి చిన్న మంట మీద గంటసేపు మరిగించాలి. పాలు బాగా మరిగి పొంగుతున్నప్పుడు గిన్నెను స్టవ్‌ మీద నుంచి దించాలి.

  • వేడి పాలను 5 గంటలు అలాగే ఉంచి చల్లార్చాలి. గిన్నెపై సగభాగం మూసేలా మూతపెట్టి లోపల తేమ చేరకుండా చూడాలి. చల్లారిన పాల గిన్నెను కదల్చకుండా జాగ్రత్తగా ఆరు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అప్పుడే మీగడ పొర గట్టిపడుతుంది.

  • తరువాత మీగడను చాకుతో గిన్నె అంచుల నుంచి మెల్లగా వేరుచేయాలి. తరువాత గరిటెతో మరో గిన్నలోకి తీయాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

రాజధాని అమరావతి పనులకు ఆటంకాలు లేకుండా వేగం పెంచాలి: నారాయణ

ఆసియా క్రీడల్లో స్వర్ణం.. కమలినికి తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా

Updated Date - Sep 23 , 2026 | 12:38 AM