బ్రొకొలి ఇలా వండుకోవాలి
ABN , Publish Date - Mar 03 , 2026 | 01:09 AM
కూరగాయలను తరుక్కుని కూర వండుకుంటాం! అయితే బ్రొకొలి పోషక ప్రయోజనాలను మెరుగ్గా పొందాలంటే ఇంకొక నియమం కూడా పాటించాలి. అదేంటంటే..
అవగాహన
కూరగాయలను తరుక్కుని కూర వండుకుంటాం! అయితే బ్రొకొలి పోషక ప్రయోజనాలను మెరుగ్గా పొందాలంటే ఇంకొక నియమం కూడా పాటించాలి. అదేంటంటే..
ఏం తింటున్నామన్నది కాదు, ఎలా తయారు చేసుకుని తింటున్నామన్నది కూడా ముఖ్యమేనని ఆధునిక సైన్స్ సూచిస్తోంది. క్రూసిఫెరస్ కూరగాయలైన కాలీఫ్లవర్, కేల్, బ్రొకొలిలలో మైరోసినేజ్ అనే కీలక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ క్యాన్సర్‌తో, ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడే సల్ఫొరఫేన్ అనే కాంపౌండ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే సాధారణంగా వండే ప్రక్రియలో వెలువడే వేడి వల్ల ఈ ఎంజైమ్‌ను మనం నష్టపోతూ ఉంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే బ్రొకొలిని ముక్కలుగా తరిగిన తర్వాత, వాటిని అలాగే ముప్పావు గంట పాటు వదిలేయాలి. ఆ వ్యవధిలో ఎంజైమ్ పోషక రూపం దాలుస్తుంది. కాబట్టి వంటకు 45 నిమిషాల ముందే బ్రొకొలిని ముక్కలుగా తరుక్కోవాలి. ఈ కూరగాయతో పాటు మిగతా కూరగాయల్లోని పోషక ప్రయోజనాలను మెరుగ్గా పొందడం కోసం, ఎంజైమ్ యాక్టివిటీకి వీలుగా వాటిని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. మరింత మెరుగైన ప్రతిఫలాన్ని పొందడం కోసం ఉడికించిన క్రూసిఫెరస్ కూరగాయలను పచ్చి ఆవాలు లేదా ముల్లంగితో కలిపి తినాలి. ఇలా తినడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్, తీవ్ర వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు