ద్రాక్ష తినేముందు
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:53 AM
బజారు నుంచి తీసుకొచ్చిన ద్రాక్ష పండ్లను శుభ్రం చేసిన తరువాతే తినాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎలా శుభ్రం చేయాలంటే...
బజారు నుంచి తీసుకొచ్చిన ద్రాక్ష పండ్లను శుభ్రం చేసిన తరువాతే తినాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎలా శుభ్రం చేయాలంటే...
ద్రాక్ష పండ్లను గుత్తులుగా ఉంచి మాత్రమే కడగాలి. పండ్లను గుత్తి నుంచి వేరుచేసి కడిగితే వాటిపై ఉన్న రసాయనాలు, దుమ్ము లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది.
ఒక గిన్నెలో సగానికి పైగా మంచినీటిని తీసుకుని అందులో చెంచా ఉప్పువేసి కలపాలి. ఈ నీటిలో ద్రాక్ష పండ్ల గుత్తులను ఉంచి పావు గంటసేపు నాననివ్వాలి. తరువాత వాటిని మరోసారి మంచినీటితో కడగాలి. అప్పుడే వాటిమీద ఉన్న పురుగుమందుల అవశేషాలు తొలగిపోతాయి.
వెడల్పాటి గిన్నెలో మంచినీటిని తీసుకుని అందులో రెండు చెంచాల నిమ్మరసాన్ని కలపాలి. ఈ నీటితో ద్రాక్ష పండ్ల గుత్తులను కడిగితే వాటిమీద ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది.
అలాగే బేకింగ్ సోడా కలిపిన నీళ్లలో ద్రాక్ష పండ్ల గుత్తులను కొద్దిసేపు నానబెట్టి ఆపైన చేత్తో రుద్ది కడిగితే వాటి మీద పేరుకున్న రసాయనాలు తొలగిపోతాయి.
వెనిగర్ కలిపిన నీళ్లలో ద్రాక్ష పండ్ల గుత్తులు వేసి పది నిమిషాలు నానబెట్టి ఆ తరువాత మంచినీటితో కడిగితే వాటిపై చేరిన దుమ్ము, ధూళి తొలగిపోతాయి. లేదంటే గోరువెచ్చటి నీటితో కడిగినా సరిపోతుంది.
ద్రాక్ష పండ్ల గుత్తులను గిన్నెలో ఉంచి వాటిమీద పంపు నీరు ధారగా పడేలా చేసి కడగడం మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి
కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతం: మంత్రి లోకేశ్..
ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం