సీలింగ్ ఫ్యాన్‌ని ఇలా...
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:41 AM
సీలింగ్ ఫ్యాన్‌ని శుభ్రం చేసేటప్పుడు గదిలో ఉన్న ఫర్నిచర్‌పై, నేలమీద దుమ్ము పడుతుంటుంది. అలాకాకుండా ఫ్యాన్ రెక్కలపై చేరిన...
సీలింగ్ ఫ్యాన్‌ని శుభ్రం చేసేటప్పుడు గదిలో ఉన్న ఫర్నిచర్‌పై, నేలమీద దుమ్ము పడుతుంటుంది. అలాకాకుండా ఫ్యాన్ రెక్కలపై చేరిన మురికిని సులువుగా తొలగించే చిట్కాలివే...
పాత దిండు గలీబులు, కుషన్ కవర్లు లేదా టీ షర్టుల్లో ఒకదాన్ని తీసుకుని ఫ్యాన్ రెక్కకు తొడగాలి. తరువాత దానితో గట్టిగా తుడుస్తూ నెమ్మదిగా వెనక్కు లాగాలి. దుమ్మంతా కవర్ లోపల అతుక్కుంటుంది. దీన్ని బయటకు తీసుకెళ్లి బాగా దులిపి శుభ్రంగా ఉతికి మరోసారి వాడవచ్చు. చివరగా పాత తువాలును తడిపి గట్టిగా పిండి ఆపైన ఫ్యాన్ రెక్కలను తుడిచేస్తే సరిపోతుంది.
ఎక్కువగా దుమ్ము లేదనిపిస్తే కొద్దిగా తడిపిన మైక్రో ఫైబర్ గుడ్డతో ఫ్యాన్ రెక్కలను తుడవవచ్చు.
పొడవాటి హ్యాండిల్ ఉన్న డస్టర్‌ను ఉపయోగించడం ప్రయోజనకరం. డస్టర్ భాగం కావలసిన విధంగా వంగుతుంటుంది కాబట్టి దానితో ఫ్యాన్ రెక్కలను శుభ్రంగా తుడుచుకోవచ్చు. అంతేకాదు హ్యాండిల్ పొడవును పెంచుకునే వీలుంటుంది కూడా. డస్టర్‌కు మైక్రో ఫైబర్ కవర్ ఉన్న మోడల్‌ని ఎంపిక చేసుకుంటే చాలాకాలం మన్నికగా ఉంటుంది.
ఫ్యాన్ రెక్కలపై జిడ్డు మరకలు పేరుకుని ఉంటే వాటిని పొడిగుడ్డతో తొలగించలేము. అప్పుడు గిన్నెలో కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి ఓ కప్పు నీటిని పోసి బాగా కలపాలి. అందులో పాత తువాలును ముంచి గట్టిగా పిండి మడతపెట్టి దానితో రెక్కలను రెండువైపులా నెమ్మదిగా తుడవాలి.
వ్యాక్యూమ్ క్లీనర్‌కు మెత్తటి బ్రష్‌ను జతచేసి సక్షన్‌ను తక్కువ ప్రెజర్‌లో సెట్‌చేసి ఫ్యాన్ రెక్కలను క్లీన్ చేయవచ్చు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్