Share News

కేలరీలు కరిగేదెలా..?

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:52 PM

కఠినమైన వ్యాయామాలతో పనిలేకుండా శరీరంలోని కేలరీలను త్వరగా కరిగించే సులువైన పనులివే...

కేలరీలు కరిగేదెలా..?

కఠినమైన వ్యాయామాలతో పనిలేకుండా శరీరంలోని కేలరీలను త్వరగా కరిగించే సులువైన పనులివే...

  • ఇల్లు ఊడవడం-తుడవడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం-ఆరేయడం-మడతపెట్టడం లాంటి పనులు చేయడం వల్ల జీవక్రియల వేగం పెరిగి అధికంగా కేలరీలు ఖర్చవుతాయి.

  • ఎప్పుడూ నవ్వుతూ ఉండడం వల్ల కూడా అధికంగా కేలరీలు కరిగిపోతాయి. రోజుకు పావుగంటసేపు పెద్దగా నవ్వితే మంచి ప్రయోజనం చేకూరుతుంది.

  • కార్యాలయంలో కూర్చుని పనిచేసేటప్పుడు, వంటింట్లో నిలబడి వంట లేదా ఇతరత్రా పనులు చేసేటప్పుడు కాళ్లు, చేతులను వేగంగా కదిలిస్తుంటే కేలరీలు సులువుగా ఖర్చయిపోతాయి.

  • ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నడక, సైకిల్‌ తొక్కడం, స్కిప్పింగ్‌ లాంటివి అలవాటు చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • మొక్కలకు నీరు పెట్టడం, అదనపు కొమ్మలు కత్తిరించడం, కలుపు మొక్కలు తొలగించడం, మట్టిని తవ్వి ఎరువులు చేర్చడం, కుండీలు మార్చడం లాంటి తోటపనులు చేసినా కూడా కేలరీలు కరిగిపోతాయి.

  • ఆరోగ్యంగా ఉన్నవారు మూడు నెలలకోసారి రక్తదానం చేస్తుంటే కొత్త రక్త కణాల ఉత్పత్తికి అధికంగా కేలరీలు ఖర్చవుతాయి.

  • రోజూ ఎనిమిదిగంటలు గాఢంగా నిద్రించినా ఫలితం ఉంటుంది.

  • గ్రీన్‌ టీ లేదా బ్లాక్‌ కాఫీ తాగడం, తాజా కూరగాయలు తీసుకోవడం, తరచూ పండ్లు తినడం, నూనెతో తయారుచేసిన చిరుతిళ్లు తగ్గించడం, ఆహారంలో తృణ ధాన్యాలను చేర్చుకోవడం, రాత్రి భోజనాన్ని మితంగా ముగించడం అలవాటు చేసుకుంటే క్రమంగా శరీరంలో కేలరీలు ఖర్చవుతుంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 05 , 2026 | 11:52 PM