చిన్నారులు చురుగ్గా ఇలా...
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:06 AM
పిల్లలు ఎదిగే క్రమంలో వారి ఆసక్తి, అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. రోజూ కొత్త అంశాలు నేర్చుకుంటూ ఉంటేనే పిల్లలు చురుగ్గా...
పిల్లలు ఎదిగే క్రమంలో వారి ఆసక్తి, అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. రోజూ కొత్త అంశాలు నేర్చుకుంటూ ఉంటేనే పిల్లలు చురుగ్గా మారతారు. అందుకోసం తల్లిదండ్రులు ఏం చేయాలంటే...
ఇంట్లోనే కట్టడి చేయకుండా రోజూ సాయంత్రం పూట పిల్లలను ఆడుకొమ్మని బయటికి పంపా లి. దీనివల్ల పిల్లలకు స్నేహితులు ఏర్పడతారు. వారితో ఎలా మెలగాలో పిల్లలు స్వయంగా తెలుసుకుంటారు. అంతేకాదు శారీరక శ్రమతోడై పిల్లలు ఉత్సాహంగా ఎదుగుతారు.
పెరిగే పిల్లలు రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. వాటన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాలి. అప్పుడే వారిలో ఊహా శక్తి, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతాయి.
తరచూ పిల్లలను పార్కులు, తోటలు, పంట పొలాలకు తీసుకెళ్లి అక్కడి చెట్లు, పక్షులు, జంతువుల గురించి చెబుతూ ఉండాలి. అప్పుడే పిల్లలకు ప్రకృతిపై అవగాహన పెరుగుతుంది. ప్రకృతిని ఆస్వాదించడం నేర్చుకుంటారు. దీంతో మెదడు పనితీరు మెరుగుపడి పిల్లలు ఉత్సాహంగా, చురుగ్గా ఎదుగుతారు.
రాత్రి పడుకునే ముందు పజిల్స్ పూరించడం, రూబిక్ క్యూబ్స్ ఆడడం, కథల పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. వీటివల్ల పిల్లల్లో మానసిక పరిపక్వత పెరుగుతుంది.
రోజూ ఉదయం లేవగానే పిల్లల చేత ధ్యానం, యోగా, తేలికపాటి వ్యాయామం లేదా సైక్లింగ్ లాంటివి చేయించాలి. వీటివల్ల శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి పిల్లలు రోజంతా చురుగ్గా ఉంటారు.
పిల్లలకు తాజా పండ్లు, కూరగాయలతోపాటు మంచి పోషకాహారం తినిపించాలి. సమయానుసారం నిద్రించడం అలవాటు చేయాలి. వీటివల్ల సరైన పోషణ అంది పిల్లలు చక్కగా ఎదుగుతారు.
ఇవి కూడా చదవండి..
నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు