Share News

ఎన్ని నీళ్లు తాగాలి?

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:30 AM

దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే సరిపోదు. చెమట, మూత్రం, శ్వాసల ద్వారా శరీరం కోల్పోతున్న నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి...

ఎన్ని నీళ్లు తాగాలి?

దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే సరిపోదు. చెమట, మూత్రం, శ్వాసల ద్వారా శరీరం కోల్పోతున్న నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. నీటి అవసరం స్త్రీపురుషుల్లో భిన్నంగా ఉంటుంది. సగటున పురుషులకు రోజుకు మూడు నుంచి మూడున్నర లీటర్ల నీళ్లు అవసరమైతే, మహిళలకు రెండున్నర నుంచి 2.7 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. నిజానికి దాహం వేసే సమయానికే శరీరం డీహైడ్రేషన్‌కు గురై ఉంటుంది. కాబట్టి దాహంతో సంబంధం లేకుండా రోజంతా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. నీటి పరిమాణాన్ని భర్తీ చేయడం కోసం నీళ్ల మీదే ఆధారపడవలసిన అవసరం లేదు. పండ్లు, కూరగాయలు, సూప్స్‌, కొబ్బరినీళ్లు కూడా తీసుకోవచ్చు. మన రోజువారీ హైడ్రేషన్‌లో 20 నుంచి 30 శాతం ఆహారం నుంచి అందేలా చూసుకోవాలి. అధిక నీళ్లు రక్తంలోని సోడియం మోతాదులను పలుచన చేసి అయోమయం, బలహీనతలకు గురి చేస్తాయి. కాబట్టి వాతావరణం, శారీరక శ్రమల ఆధారంగా నీటి మోతాదును సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి.

ఈ వార్తలనూ చదవండి:

బంగారు గుడ్లు పెట్టే బాతును చంపితే.. కేంద్రానికి అన్నామలై వార్నింగ్

’ఫర్జీ’ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో నకిలీ నోట్ల ముద్రణ.. నిందితుల అరెస్టు

Updated Date - Oct 27 , 2026 | 03:46 AM