Share News

పిల్లలకూ కాస్త సమయం ఇవ్వండి

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:53 AM

నేటి డిజిటల్‌ ప్రపంచంలో పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారింది. గాడ్జెట్ల గోల లేకుండా పిల్లల...

పిల్లలకూ కాస్త సమయం ఇవ్వండి

నేటి డిజిటల్‌ ప్రపంచంలో పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారింది. గాడ్జెట్ల గోల లేకుండా పిల్లల మనసును అర్థం చేసుకుంటూ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎలా తీద్చిదిద్దాలో చూద్దాం.

పిల్లలకు మనం ఇచ్చే అత్యంత విలువైన కానుక... సమయం. చాలామంది తల్లిదండ్రులు రోజంతా కష్టపడి పిల్లల కోసం సంపాదిస్తున్నాం అనుకుంటారు. కానీ వారితో గడిపే పది నిమిషాల ప్రశాంత సమయం వారి ఎదుగుదలపై గొప్ప ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా యాక్టివ్‌ లిజనింగ్‌ అలవాటు చేసుకోవాలి. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు ఫోన్‌ పక్కనపెట్టి, వారి కళ్లలోకి చూస్తూ వినడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి చిన్నచిన్న విజయాలను అభినందించడం వల్ల వారు మరిన్ని సానుకూల పనులు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.

టైమ్‌...

పిల్లలను మొబైళ్లకు దూరం చేయాలంటే ముందుగా తల్లిదండ్రులు వారి ముందు ఫోన్లు వాడటం తగ్గించాలి. పుస్తక పఠనం, ఇండోర్‌ గేమ్స్‌ వంటివి వారిలో సృజనాత్మకతను పెంచుతాయి. అలాగే పిల్లలకి ‘నో’ అని చెప్పడం కూడా నేర్పాలి. అడిగినవన్నీ వెంటనే ఇచ్చేయడం వల్ల వారికి వస్తువుల విలువ తెలియకుండా పోతుంది. క్రమశిక్షణ అంటే కొట్టడం లేదా తిట్టడం కాదు. వారికి ఏది మంచో, ఏది చెడో సున్నితంగా వివరించడం. పిల్లలు మన మాటల కంటే చేతలను చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి మనం వారికి ఒక రోల్‌ మోడల్‌లాగా ఉండాలి.

ఇవి కూడా చదవండి...

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 12:53 AM