హార్మోన్ల సమస్యలు వేధిస్తున్నాయా..?
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:09 AM
హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆకలి, నిద్ర, జీవక్రియలు, నెలసరి తీవ్రంగా ప్రభావితమవుతాయి. అలాకాకుండా హార్మోన్లు సక్రమంగా పనిచేసేందుకు, పలు అనారోగ్య సమస్యలు తీరేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం...
హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆకలి, నిద్ర, జీవక్రియలు, నెలసరి తీవ్రంగా ప్రభావితమవుతాయి. అలాకాకుండా హార్మోన్లు సక్రమంగా పనిచేసేందుకు, పలు అనారోగ్య సమస్యలు తీరేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం...
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే సాల్మన్, సార్డిన్స్, మాకెరెల్, ట్యూనా చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి గుండె, మెదడు పనితీరును మెరుగుపరచడంతోపాటు శరీరంలోని కణాల వృద్ధికి తోడ్పడతాయి.
అవిసె గింజలు, చియా గింజలను పెరుగు, ఓట్స్, సలాడ్స్, స్మూతీల్లో కలుపుకుని తినవచ్చు. వీటిలోని పీచు జీవక్రియలను క్రమబద్దీకరిస్తుంది. గుమ్మడి గింజలు, ప్రొద్దు తిరుగుడు గింజలను తినడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.
బాదం, వాల్‌నట్స్, సోయా, పనీర్‌లను తరచూ తీసుకుంటుండాలి. వీటిలోని ప్రోటీన్లు, ఇతర పోషకాలు నీరసాన్ని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఉపకరిస్తాయి.
తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, మొలకలు, పప్పు ధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు లభించి శరీరంలోని అనారోగ్య సమస్యలన్నీ మాయమవుతాయి. ముఖ్యంగా పాలకూర, మెంతికూర లాంటివి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి.
అవకాడో, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, గుడ్లను ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో ఆరోగ్యకరమైన క్రొవ్వులు పెరగడంతోపాటు హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి.
గ్రీన్ టీ, హెర్బల్ టీ, పసుపు, పెరుగు, మెంతులు, బీట్‌రూట్, క్యారట్, దానిమ్మలు ఒత్తిడిని తగ్గించి హార్మోన్ల నియంత్రణకు తోడ్పడతాయి.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..