Share News

లిప్‌ బామ్‌ను ఇలా...

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:07 AM

పెదవులు తేమగా మృదువుగా ఉండేందుకు రాసుకునే లిప్‌ బామ్‌ను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

లిప్‌ బామ్‌ను ఇలా...

పెదవులు తేమగా మృదువుగా ఉండేందుకు రాసుకునే లిప్‌ బామ్‌ను ఇంట్లోనే ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి సగం దాకా నీటిని పోసి అందులో మరో గిన్నెను ఉంచి రెండు చెంచాల కొబ్బరి నూనె వేసి డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో వేడిచేయాలి. తరువాత అందులో రెండు చెంచాల బీస్‌ వ్యాక్స్‌(తేనె మైనం) వేసి కలుపుతూ కరిగించాలి. ఆపైన గిన్నెను కిందికి దించి మిశ్రమాన్ని కొద్దిగా చల్లార్చి చెంచా తేనె, ఏడు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి చిన్న డబ్బాలోకి తీయాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాత మూతపెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ లిప్‌ బామ్‌ని రోజూ పడుకునే ముందు రాసుకుంటే పెదవులు పొడిబారడం, పగలడం తగ్గుతాయి. అంతేకాదు తేమతో నిండి మృదువుగా మారతాయి.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల కొబ్బరి నూనె, రెండు చెంచాల తేనె మైనం వేసి డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో కరిగించి దించాలి. ఆపైన రెండు చెంచాల డ్రైడ్‌ రాస్‌బెర్రీ పొడి, ఎనిమిది చుక్కల ఇ విటమిన్‌ ఆయిల్‌ వేసి కలిపి చిన్న డబ్బాలోకి తీసి చల్లార్చి మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ లిప్‌ బామ్‌ను రోజుకు రెండుసార్లు రాసుకుంటుంటే పిగ్మెంటేషన్‌ పూర్తిగా మాయమై పెదవులు మృదువుగా గులాబీ రంగులో మెరుస్తుంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 12:07 AM