ఒంట్లో వేడి తగ్గేదెలా.!
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:30 AM
ఎండాకాలంలో ఎక్కువగా శరీరం వేడెక్కడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా చిన్న చిట్కాలతో...
ఎండాకాలంలో ఎక్కువగా శరీరం వేడెక్కడం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా చిన్న చిట్కాలతో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవచ్చు. అవేంటంటే...
ఒక గ్లాసు మంచినీటిలో రెండు చెంచాల తాటిబెల్లం కలుపుకుని తాగితే వెంటనే శరీరంలో వేడి తగ్గుతుంది.
తరచూ నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు, సగ్గుబియ్యం జావ, రాగి జావ, ఎర్ర మందారం టీ తీసుకోవడం వల్ల కూడా శీరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
స్నానానికి ముందు కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనె, బాదం నూనెతో మర్ధన చేసుకున్నా శరీరం చల్లగా ఉంటుంది
రాత్రి పడుకునేముందు కుంకుమ పువ్వు రేకులు కలిపిన పాలు తాగితే ఉదయానికల్లా ఒంట్లో వేడి తగ్గుతుంది.
ఒక గిన్నెలో చెంచా సోంపు, అర చెంచా జీలకర్ర, చెంచా ధనియాలు వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని వడబోసి తాగితే ఒళ్లంతా చలువగా అనిపిస్తుంది
చెంచా మెంతులను దోరగా వేయించి మెత్తటి పొడిలా చేసుకుని ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే ఒంట్లో వేడి నియంత్రణలోకి వస్తుంది.
దాహంగా అనిపించకపోయినా గంటకోసారి మంచినీళ్లు తాగుతూ ఉండాలి. తరచూ తాజా పండ్ల రసాలు, పలుచని మజ్జిగ తాగుతూ ఉంటే శరీరంలో వేడి తగ్గుతుంది.
రోజూ ఆహారంలో దోసకాయ, బీరకాయ, కీరా, టమాటాలతోపాటు ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. పుచ్చకాయ, కర్బూజా, అనాస, దానిమ్మ, ద్రాక్ష పండ్లు తింటూ ఉండాలి.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత