Share News

ఇంట్లో ప్లేస్‌ సరిపోవట్లేదా

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:54 AM

ఒక్కోసారి ఇంట్లో షెల్ఫ్‌లు, టేబుల్స్‌ పూర్తిగా వస్తువులతో నిండి పోతుంటాయి. దీనివల్ల ఇంటి అందం దెబ్బతినడమే కాదు కొత్త వాటిని సర్దడానికి చోటుండదు. అలాకాకుండా ఇంట్లో...

ఇంట్లో ప్లేస్‌ సరిపోవట్లేదా

ఒక్కోసారి ఇంట్లో షెల్ఫ్‌లు, టేబుల్స్‌ పూర్తిగా వస్తువులతో నిండి పోతుంటాయి. దీనివల్ల ఇంటి అందం దెబ్బతినడమే కాదు కొత్త వాటిని సర్దడానికి చోటుండదు. అలాకాకుండా ఇంట్లో ప్లేస్‌ కలిసి వచ్చేందుకు పాటించాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం...

  • ఇంట్లో వాడని, పాడైపోయిన ఎలకా్ట్రనిక్‌ వస్తువులను తొలగించాలి. పాతవైనప్పటికీ అరల్లో దాచిన టీవీ, ఫ్యాన్లు, కూలర్లు, మొబైల్స్‌, ఛార్జర్లు, బల్బులు, ఇతర గాడ్జెట్లను తీసేయాలి. అప్పుడు చాలా ప్లేస్‌ కనిపిస్తుంది

  • ఏళ్ల తరబడి వేసుకోని డ్రెస్‌లు, చీరలను అవసరమైనవారికి ఇచ్చేయాలి. అలాగే పిల్లలకు పొట్టయిన దుస్తులను ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి. దీంతో షెల్ఫ్‌లలో బీరువాలో చాలా ప్లేస్‌ ఏర్పడుతుంది

  • గడువు ముగిసిన మందుల సీసాలు, ట్యాబ్లెట్‌ షీట్లు, అవసరం లేని ప్రిస్కిప్షన్‌ కాగితాలు, ఎక్స్‌రేలు లాంటివాటిని తొలగించాలి.

  • వంటగదిలో వాడని పాత గిన్నెలు, కంచాలు, పగిలిన పింగాణీ సామాన్లను తీసివేయాలి. అవసరానికి మించి ఉన్న స్టీలు సామాన్లను పెద్ద అట్టపెట్టెల్లో ఉంచి అటకమీద సర్దుకోవాలి. ప్లాస్టిక్‌ డబ్బాలు, రకరకాల గిఫ్ట్‌ ఐటెమ్స్‌, ఇతర సామాన్లను అవసరమైనవారికి ఇచ్చేయాలి.

  • పాత పేపర్లు, చదవని పుస్తకాలు, పిల్లల నోట్‌బుక్స్‌, వాడని బ్యాగ్‌లను కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఇలాంటివి ఇంటిని అస్తవ్యస్తంగా మార్చేస్తుంటాయి.

  • పాడైన ఆట బొమ్మలు, పిల్లలు ఆడుకోకుండా వదిలేసిన పాత బొమ్మలు, సగం వాడిన క్రేయాన్స్‌, రంగుల సీసాలు, పూర్తిచేసిన డ్రాయింగ్‌ బుక్స్‌ లాంటివాటిని కూడా తొలగించాలి.

  • చాలాకాలంగా వేసుకోని చెప్పులు, షూస్‌, సాక్స్‌లను తీసేయాలి. ఆరిపోయిన షూ పాలిష్‌ డబ్బాలు, పాత బ్రష్‌లను కూడా తొలగించాలి.

ఇవీ చదవండి:

రీ-నీట్ ఎఫెక్ట్.. ప్రధాని మోదీ ప్రయాణం వాయిదా

భారత్ - ఈయూ ఫ్రీ ట్రేడ్ డీల్.. డిసెంబర్‌లో సంతకాలు!

Updated Date - Jun 22 , 2026 | 01:54 AM