Share News

వంటిల్లే మినీ కేఫ్‌

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:20 AM

ఖరీదైన కాఫీ షాపులకు వెళ్లకుండా, ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా ఫ్యాన్సీ డ్రింక్స్‌, బేకరీ వంటకాలు తయారు చేసుకుంటూ..

వంటిల్లే మినీ కేఫ్‌

ఖరీదైన కాఫీ షాపులకు వెళ్లకుండా, ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా ఫ్యాన్సీ డ్రింక్స్‌, బేకరీ వంటకాలు తయారు చేసుకుంటూ ఆస్వాదించే ట్రెండ్‌ ఇది. వారాంతంలో లేదా సాయంత్రం వేళల్లో బయట ఖరీదైన కేఫ్‌లకు వెళ్లేబదులు, ఇంట్లోనే ఒక మూలను అందమైన కేఫ్‌లా మార్చుకోవడం ఈ ట్రెండ్‌ ప్రత్యేకత.

అచ్చం కేఫ్‌లాంటి అనుభూతి

ఇంట్లోని డైనింగ్‌ టేబుల్‌ పక్కనో లేదా బాల్కనీలోనో ఒక చిన్న కార్నర్‌ను ‘కాఫీ స్టేషన్‌’లా సెట్‌ చేసుకోవడం ఇందులో మొదటి అడుగు. అందమైన సిరామిక్‌ మగ్‌లు, గాజు గ్లాసులు, మిల్క్‌ ఫ్రాథర్‌ వంటి చిన్నపాటి వస్తువులను ఆకర్షణీయంగా అమర్చుకోవాలి. పక్కనే ఒక చిన్న ఇండోర్‌ మొక్క లేదా సువాసన వెదజల్లే క్యాండిల్‌ పెడితే, ఇంట్లోనే అచ్చం స్టార్‌ కేఫ్‌లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది.

ప్రయోగాలతో కొత్త రుచులు

సాధారణ టీ, కాఫీలకు బదులుగా కోల్డ్‌ బ్రూ కాఫీ, మాచా లాట్టే, ఫ్రూట్‌ స్మూతీలు, ఇంట్లోనే బేక్‌ చేసిన కుకీలు, బ్రౌనీలను ప్రయోగాత్మకంగా తయారు చేయడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

బడ్జెట్‌ ఆదా.. ఆత్మసంతృప్తి

బయట కేఫ్‌లలో దొరికే పదార్థాల కంటే ఎంతో ఆరోగ్యకరంగా, తక్కువ ఖర్చుతో వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఈ హోమ్‌ కేఫ్‌లో ముచ్చట్లు పెట్టడం వల్ల రోజంతా పడిన అలసట ఇట్టే మాయమైపోతుంది.

ఈ వార్తలూ చదవండి

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం

Updated Date - Nov 16 , 2026 | 03:20 AM