Share News

లవంగాలతో ఇలా...

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:24 AM

ముఖంపై ఏర్పడే మొటిమలు, గుల్లలు, మచ్చలు, ఇన్ఫెక్షన్లను నివారించేందుకు తోడ్పడే ‘లవంగాల నైట్‌ క్రీమ్‌’ తయారీ విధానాన్ని తెలుసుకుందాం...

లవంగాలతో ఇలా...

ముఖంపై ఏర్పడే మొటిమలు, గుల్లలు, మచ్చలు, ఇన్ఫెక్షన్లను నివారించేందుకు తోడ్పడే ‘లవంగాల నైట్‌ క్రీమ్‌’ తయారీ విధానాన్ని తెలుసుకుందాం...

కావాల్సిన పదార్థాలు: లవంగాలు- 12, మంచి నీరు- అర కప్పు, కలబంద గుజ్జు- రెండు చెంచాలు, ఇ విటమిన్‌ ట్యాబ్లెట్‌- ఒకటి, బాదం నూనె- చెంచా

తయారీ విధానం: స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి మంచినీటిని పోసి లవంగాలు వేసి పావుగంటసేపు బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిని మరో గిన్నెలోకి వడబోసి చల్లార్చాలి. ఆపైన కలబంద గుజ్జు, ఇ విటమిన్‌ ఆయిల్‌, బాదం నూనె వేసి క్రీమ్‌లా వచ్చే వరకు చెంచాతో వేగంగా కలపాలి. తరువాత గాజు సీసాలోకి తీసి భద్రపరచుకోవాలి.

  • ఈ లవంగాల క్రీమ్‌ను రోజూ రాత్రి పడుకునేముందు ముఖానికి, మెడకి పలుచగా అప్లయ్‌ చేయాలి. ఆపైన కొద్దిసేపు సున్నితంగా మర్దన చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా ప్రకాశిస్తుంది. ఇది యాంటీ ఏజింగ్‌ క్రీమ్‌లా పనిచేస్తుంది కూడా. వయసు పెరిగే కొద్దీ నుదుటి మీద కనిపించే సన్నని గీతలను, మూతి చుట్టూ ఏర్పడే ముడుతలను మాయం చేస్తుంది. ఎండ వల్ల ముఖంపై వచ్చే పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. లవంగాల్లో ఉండే యూజినాల్‌ సమ్మేళనాలు.. మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. దీంతో మొటిమల వల్ల వచ్చే వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మచ్చలు తగ్గి ముఖం మృదువుగా ఛాయగా మెరుస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 01:24 AM