Share News

పెద్దల నడక తడబడకుండా..

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:52 AM

సుప్రసిద్ధ నటి హెలెన్‌ డాన్స్‌ నంబర్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారవాన్‌ నుంచి షోలే వరకూ ఆమె నటించిన ప్రతి పాటా ఒక సంచలనమే!...

పెద్దల నడక తడబడకుండా..

సెలెబ్‌ ఫిట్‌

సుప్రసిద్ధ నటి హెలెన్‌ డాన్స్‌ నంబర్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కారవాన్‌ నుంచి షోలే వరకూ ఆమె నటించిన ప్రతి పాటా ఒక సంచలనమే! ప్రస్తుతం 86 ఏళ్ల వయసులో కూడా అంతే చురుగ్గా వ్యాయామాలు చేస్తూ తనలోని డాన్సర్‌ను సజీవంగా ఉంచుకుంటున్నారామె! ముదిమి వయసులో ఆమె అనుసరిస్తున్న వ్యాయామ నియమాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందామా?

86 ఏళ్ల వయసులో వ్యాయామం చేసేవాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. పెద్ద వయసులో వ్యాయామం అవసరం ఎంత? అన్న ప్రశ్నకు హెలెన్‌ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ‘వ్యాయామం నాలో ఉత్సాహాన్ని పెంచుతుంది. పూర్తి ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. నా శరీరం వ్యాయామాన్ని ఇష్టపడుతుంది. వ్యాయామంతో సంతులనం సాధించడంతో పాటు నడక మీద ఏకాగ్రత పెరుగుతుంది’ అంటున్నారు హెలెన్‌. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వృద్ధుల్లో నడక పట్టుతప్పడం, తూలడం లాంటి ఇబ్బందులు తలెత్తవు. శరీరం మీద ఇలాంటి పట్టు పెంచుకోవడం కోసం హెలెన్‌ క్రమం తప్పకుండా అనుసరించే కొన్ని తేలికపాటి వ్యాయామాలు ఏవంటే...

  • స్టాండ్‌ టు సిట్‌: కాళ్లు, చీలమండలాల మీద బరువు మోపుతూ లేచి నిలబడడమే సిట్‌ టు స్టాండ్‌. సాధారణంగా పెద్దలు కుర్చీలో నుంచి లేచి నిలబడేటప్పుడు హ్యాండ్‌ రెస్ట్‌ల మీద చేతులుంచి వాటి ఆధారంగా లేచి నిలబడతారు. బదులుగా సిట్‌ టు స్టాండ్‌ పద్ధతిని సాధన చేయడం వల్ల, శరీరం మీద పట్టు పెరుగుతుంది

  • హీల్‌ రైజెస్‌: చీలమండల కదలికలకు ఎంతో కీలకమైన వ్యాయామమిది. నిలబడిన భంగిమలో, మడమలను పైకి లేపి కిందకు దింపాలి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు చేతికి ఆసరా కావాలనుకుంటే కుర్చీ మీద చేతులుంచి మడమలను పైకి లేపి దింపవచ్చు.

  • బ్రిడ్జెస్‌: నేల మీద వెల్లకిలా పడుకుని, మోకాళ్ల మడవాలి. తర్వాత నెమ్మదిగా నడుమును పైకి లేపి దింపాలి. నడుమును పైకి లేపేటప్పుడు మెడ కంటే ఎత్తుకు తీసుకువెళ్లవలసిన అవసరం లేదు.


33-Navya.jpg

  • మార్చింగ్‌: బ్రిడ్జెస్‌ భంగిమలోనే ఉండిపోయి, ఒక మోకాలిని పొట్ట దగ్గరకు లేపి, తిరిగి నేల మీద ఆనించాలి. తర్వాత రెండో కాలిని కూడా ఇలాగే కదిలించాలి.

  • వాల్‌ పుషప్‌: గోడ ఎదురుగా నిలబడి రెండు అరచేతులను , భుజాల కంటే దిగువకు గోడ మీద ఉంచి పుషప్స్‌ చేయాలి. ఈ వ్యాయామం చేసేటప్పుడు కాళ్లను గోడకు దూరంగా ఉంచి, మోచేతులను మడుస్తూ ముందుకు వంగి లేస్తూ ఉండాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 01:52 AM