Share News

గుండె ఆరోగ్యం మన చేతుల్లో...

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:51 PM

మన చేయి కలిగి ఉండే శక్తి ద్వారా వాస్తవిక గుండె వయసును కనిపెట్టవచ్చు. గుండె వైఫల్యాన్ని ఎన్నో ఏళ్ల ముందే అంచనా వేయడానికి వైద్యులు ఈ శక్తినే ఉపయోగిస్తున్నారు. బలహీనమైన చేతులు...

గుండె ఆరోగ్యం మన చేతుల్లో...

మీకు తెలుసా?

మన చేయి కలిగి ఉండే శక్తి ద్వారా వాస్తవిక గుండె వయసును కనిపెట్టవచ్చు. గుండె వైఫల్యాన్ని ఎన్నో ఏళ్ల ముందే అంచనా వేయడానికి వైద్యులు ఈ శక్తినే ఉపయోగిస్తున్నారు. బలహీనమైన చేతులు గుండె కండర క్షీణతకూ, అవసరానికి మించి శ్రమ పడుతున్న గుండెకూ సూచనలు. పూర్తి భౌతిక ఆరోగ్యాన్ని తెలిపే సరళమైన, అత్యంత ప్రభావవంతమైన కీలక లక్షణమిది. సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌, మెటబాలిక్‌ సమస్యలు మన అస్థిపంజర కండరాల్లోనే బహిర్గతమవుతాయి. 60 సెకన్ల పాటు ఒక బార్‌ నుంచి వేలాడలేనప్పుడు, మన వ్యవస్థ విఫలమవుతోందని అర్థం. పెద్దల్లో... చేతి శక్తి, ఎముకల సాంద్రతకూ, మెదడు ఆరోగ్యానికీ సంకేతం లాంటిది. కాబట్టి దృఢమైన పట్టును పెంచుకోవడం ద్వారా, భవిష్యత్తులో క్షీణించబోయే మెదడు ఆరోగ్యాన్ని దృఢపరుచుకున్నవాళ్లం అవుతాం! అందుకోసం జిమ్‌లో వ్యాయామాలు చేయవలసిన అవసరం లేదు. బరువులను మోస్తూ ఉండడం, వేలాడడం ద్వారా కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. కాబట్టి గుండె రక్షణ కోసం, ఆయుర్దాయం కోసం చేతులను ఆయుధాలుగా మార్చుకోవాలి.

ఇవి కూడా చదవండి..

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

Updated Date - Feb 10 , 2026 | 12:04 AM