Share News

ఆరోగ్యంగా ఇలా

ABN , Publish Date - May 27 , 2026 | 03:30 AM

సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతోపాటు పాటించాల్సిన నియమ నిబంధనలు ఇవే...

ఆరోగ్యంగా ఇలా

సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతోపాటు పాటించాల్సిన నియమ నిబంధనలు ఇవే...

  • ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఏమి తింటున్నామనేదానిపైనే దృష్టి నిలపాలి. టీవీ, మొబైల్‌ చూస్తూ తినకూడదు. ప్రశాంతంగా కూర్చుని నిదానంగా తినాలి. చెంచాతో కాకుండా చేత్తో తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమై తక్షణమే శక్తి లభిస్తుంది.

  • ఉదయం అల్పాహారాన్ని మానకూడదు. తరచూ మంచినీటిని తాగుతూ ఉండాలి. రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి.

  • రోజూ బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు, గుమ్మడి గింజలు, వేరుశనగ గుండ్లు, ఖర్జూరం, నువ్వులు లాంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.

  • కాలానుగుణంగా లభించే కాయగూరలు, ఆకుకూరలు, తాజా పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.

  • రాగులు, జొన్నలు, కొర్రలు లాంటి చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు శరీర బరువు అదుపులో ఉంటుంది.

  • పాలు, పెరుగు, నెయ్యి, పనీర్‌లను తరచూ తీసుకుంటూ ఉంటే ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి. జీవక్రియలు సజావుగా జరుగుతాయి.

  • రోజూ విధిగా వ్యాయామం చేయాలి. ఉదయాన్నే చిన్న చిన్న వర్కవుట్స్‌, సాయంత్రం వాకింగ్‌ అలవాటు చేసుకోవాలి. యోగా, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

  • సమయానుసారం పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించా... కాంగ్రెస్ అధిష్టానం

చొరబాట్లతో అసహజ జనాభా మార్పుపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ.. అమిత్‌షా

Updated Date - May 27 , 2026 | 03:30 AM