Share News

ఇవి తిందాం!

ABN , Publish Date - Jul 21 , 2026 | 01:47 AM

సాధారణంగా మనం గోల్డెన్‌ రైజిన్స్‌ అంటే పసుపురంగులో ఉండే ఎండు ద్రాక్ష తింటూ ఉంటాం. కానీ రంగు మారకుండా ఉండడం కోసం వీటిని సల్ఫర్‌తో శుద్ధి చేస్తారు...

ఇవి తిందాం!

ఫుడ్‌ ఫ్యాక్ట్‌

నల్ల ఎండు ద్రాక్ష/బ్లాక్‌ రైజిన్స్‌: సాధారణంగా మనం గోల్డెన్‌ రైజిన్స్‌ అంటే పసుపురంగులో ఉండే ఎండు ద్రాక్ష తింటూ ఉంటాం. కానీ రంగు మారకుండా ఉండడం కోసం వీటిని సల్ఫర్‌తో శుద్ధి చేస్తారు. దాంతో ఈ ద్రాక్ష సహజసిద్ధ వృక్ష సమ్మేళనాలను కోల్పోతుంది. కానీ నల్ల ద్రాక్షను సాధారణంగా ఎండలో ఎండబెడతారు. కాబట్టి వీటి డార్క్‌ పిగ్మెంట్‌ వల్ల, వీటిలోని యాంటీయాక్సిడెంట్లు నష్టపోకుండా ఉంటాయి.

అన్‌సాల్టెడ్‌ పిస్తా: మనం రుచి కోసం ఉప్పు కలిపిన పిస్తా ఎంచుకుంటూ ఉంటాం. కానీ వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా శుద్ధి చేస్తారు. కాబట్టి వీటితో ఒంట్లో నీటి నిల్వ పెరుగుతుంది. బదులుగా ఉప్పు కలపని, శుద్ధి చేయని పిస్తా ఎంచుకుంటే, రక్తపోటు పెరగకుండా ఉంటుంది.

మెజ్దూల్‌ ఖర్జూరం: ఖర్జూరంలో పొటాషియం తక్కువ. మజ్దూల్‌ ఖర్జూరాలు పెద్దవిగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

మర్మా బాదం: సాధారణ బాదంలో నూనె పరిమాణం తక్కువ. కానీ మర్మా బాదంలో పోషకాలు, నూనె ఎక్కువ.

ఆర్గానిక్‌ సన్‌ డ్రైడ్‌ ఫిగ్స్‌: డ్రైడ్‌ అంజీర్‌ను ఎక్కువగా శుద్ధి చేయడంతో పాటు, వాటికి నిల్వ పదార్థాలను కూడా జోడిస్తారు. ఆర్గానిక్‌ సన్‌ డ్రైడ్‌ ఫిగ్స్‌లో సింథటిక్‌ పురుగుమందుల అవశేషాలు, నిల్వ పదార్థాలూ ఉండవు.

అప్రికాట్స్‌: బంగారు వర్ణంలో మెరిసిపోయే అప్రికాట్స్‌ ఆ రంగు సల్ఫర్‌ డయాక్సైడ్‌ వల్ల సమకూరుతుంది. వీటిలో నిల్వ పదార్థాలు కూడా ఎక్కువే! కాబట్టి వీటికి బదులుగా అన్‌సల్ఫర్డ్‌ డ్రైడ్‌ అప్రికాట్స్‌ ఎంచుకోవాలి. ముదురు రంగులో ఉండే ఈ అప్రికాట్స్‌ను సహజసిద్ధంగా ఎండబెడతారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్

మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..

Updated Date - Jul 21 , 2026 | 01:48 AM