Share News

ఆరోగ్యకరమైన అల్పాహారం..!

ABN , Publish Date - Oct 07 , 2026 | 01:27 AM

తక్షణ శక్తిని పొందడంతోపాటు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అల్పాహారంగా ఇవి తీసుకోండి...

ఆరోగ్యకరమైన అల్పాహారం..!

తక్షణ శక్తిని పొందడంతోపాటు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అల్పాహారంగా ఇవి తీసుకోండి...

  • చియా గింజలు, బ్లూ బెర్రీలతో తయారుచేసిన ఓ కప్పు ఓట్స్‌ మంచి ఎంపిక. ఇది త్వరగా జీర్ణమవుతుంది. ఉడికించిన కూరగాయలు, కోడి గుడ్లతోపాటు బ్రౌన్‌ బ్రెడ్‌ను తినవచ్చు. వీటివల్ల కడుపులో ఎసిడిటీ రాదు.

  • ఉదయం పూట అల్పాహారంగా సాదా దోశను సాంబారుతో తినడం మంచిది. స్ట్రాబెర్రీ ముక్కలు, దానిమ్మ గింజలతో కూడిన కప్పు యోగర్ట్‌ను కూడా తీసుకోవచ్చు. వీటివల్ల శరీరానికి ప్రోటీన్లు, అవసరమైన పోషకాలు లభిస్తాయి.

  • కివీ ముక్కలు, నీటిలో నానబెట్టిన చియా గింజలతో తయారుచేసిన పుడ్డింగ్‌ను తినవచ్చు. అరటి పండు ముక్కలు, వాల్‌నట్స్‌ కలిపి చేసిన ఓట్‌మీల్‌ ను తిన్నా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటివల్ల జీర్ణక్రియకు అవసర మైన పీచుతోపాటు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి.

  • పాలకూర, కొత్తిమీర, పుదీనా, కేరట్‌, బీట్‌రూట్‌లను సన్నగా తరిగి కోడిగుడ్ల సొనల్లో కలిపి ఆమ్లెట్‌ వేసుకుని తినవచ్చు. ఈ ఆమ్లెట్‌లో ఉల్లిపాయ ముక్కలను కలపకూడదు. దీనితోపాటు కీర సలాడ్‌ను తినడం శ్రేయస్కరం.

  • గ్లాసు పాలు, కొన్ని డ్రై ఫ్రూట్స్‌(ఖర్జూరం, బాదం, కాజు, వాల్‌నట్స్‌, అంజూర్‌, కిస్‌మిస్‌లు), మితంగా గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవచ్చు.

  • నూనె పదార్థాలు, స్వీట్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, పుల్లటి పండ్లు కాకుండా తేలికగా జీర్ణమయ్యే వాటిని అల్పాహారంలో చేర్చుకోవడం మంచిది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 01:27 AM