పోషక జలం
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:47 PM
పండ్లు పోషకభరితాలు. వీటిలోని పోషకాలను రోజంతా అందుకోవాలంటే పండ్ల ముక్కలను నీళ్లలో కలుపుకోవాలి...
ఆరోగ్యం
పండ్లు పోషకభరితాలు. వీటిలోని పోషకాలను రోజంతా అందుకోవాలంటే పండ్ల ముక్కలను నీళ్లలో కలుపుకోవాలి. ఈ నీళ్లతో బడలిక దరి చేరకుండా ఉంటుంది. రోజంతా హుషారుగా ఉండగలుగుతాం!
కావలసిన పదార్థాలు:
స్ట్రాబెర్రీలు - 4
నిమ్మకాయ - 1
నీళ్లు - 4 గ్లాసులు
తులసి ఆకులు - 5
తేనె - 1 టేబుల్ స్పూను
తయారీ విధానం:
స్ట్రాబెర్రీలు శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి పెట్టుకోవాలి.
నిమ్మకాయ చక్రాలుగా కోసుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి, ముక్కలు, తేనె, తులసి ఆకులు వేసి కలపాలి.
ఫ ఈ గిన్నెను ఫ్రిజ్‌లో 3 గంటల నుంచి 2 రోజుల వరకూ ఉంచి వాడుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం