చిటికెలో చెక్
ABN , Publish Date - Mar 03 , 2026 | 12:54 AM
కొన్ని సమస్యలు తేలికైన చిట్కాలతో సమసిపోతాయి. అయితే అందుకోసం సమస్య మూల కారణాన్ని కనిపెట్టాలి. సాధారణంగా తలెత్తే సమస్యలు, వాటి కారణాలు,...
చిట్కాలు
కొన్ని సమస్యలు తేలికైన చిట్కాలతో సమసిపోతాయి. అయితే అందుకోసం సమస్య మూల కారణాన్ని కనిపెట్టాలి. సాధారణంగా తలెత్తే సమస్యలు, వాటి కారణాలు, పరిష్కారాలు ఇవే!
మలబద్ధకం వేధిస్తోందా? కారణం పొటాషియం లోపం కావచ్చు. భర్తీ కోసం యాపిల్ తినాలి. యాపిల్‌తో ద్రవాలు సంతులనమై, పేగుల కదలికలు పెరుగుతాయి
వృద్ధాప్య లక్షణాలు దరి చేరకుండా ఉండాలంటే? విటమిన్ బి12 సరిపడా తీసుకోవాలి. అందుకోసం పుచ్చకాయ తినాలి. దీన్లోని పోషకాలు చర్మాన్ని మరమ్మత్తు చేసి, సాగే గుణాన్ని పెంచుతాయి
తరచూ ఆకలి వేధిస్తే? మెగ్నీషియం కొరవడిందని అర్థం. అందుకోసం గుమ్మడి విత్తనాలు తినాలి. వీటితో చక్కెర మోతాదులు స్థిరమై, ఆకలి అదుపులోకొస్తుంది
తిన్న వెంటనే కడుపుబ్బరం వేధిస్తోందా? అయితే జీర్ణరసాలు లోపించాయని అర్థం. వీటి కోసం బొప్పాయి పండు తినాలి. బొప్పాయితో జీర్ణక్రియ మెరుగు పడి, పొట్టలో గ్యాస్ తగ్గుతుంది
అలసట విసిగిస్తోందా? అయితే ఐరన్ లోపంగా భావించాలి. ఈ లోపాన్ని భర్తీ చేయడం కోసం, ఖర్జూరం, పాలకూర తినాలి. వీటితో దక్కే ఐరన్‌తో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి, శక్తి సమకూరుతుంది
వెంట్రుకలు రాలుతున్నాయా? అయితే ప్రొటీన్ తీసుకోవాలి. అందుకోసం పన్నీర్, గుడ్లు తినాలి. గుడ్లతో కెరటిన్ పెరిగి, వెంట్రుకల కుదుళ్లు బలపడతాయి
చక్కెర పెరుగుతోందా? అయితే పీచు ఎక్కువ తీసుకోవాలి. అందుకోసం చియా విత్తనాలు తినాలి. ఈ విత్తనాలతో గ్లూకోజ్ శోషణ పెరిగి, శక్తి స్థిరంగా ఉంటుంది.
పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. అందుకోసం వాల్‌నట్స్ తినాలి. వీటితో చర్మం మృదువుగా, తేమగా మారుతుంది
నిద్రలేమి వేధిస్తోందా? అయితే ట్రిప్టోఫాన్, మెగ్నీషియం తీసుకోవాలి. అందుకోసం గోరువెచ్చని పాలు తాగాలి. పాలతో సెరటోనిన్ పెరిగి హాయిగా నిద్రపడుతుంది
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు