నేల మీద కూర్చుని తిందాం
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:54 AM
కాళ్లు ముడుచుకుని నేలమీద కూర్చుని భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
కాళ్లు ముడుచుకుని నేలమీద కూర్చుని భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
నేలమీద కూర్చుని తినడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో కదలికలు పెరిగి అవి దృఢంగా మారతాయి. నడుము భాగాన్ని కొద్దిగా వంచినట్లుండే భంగిమ వల్ల శరీరంలో ఏర్పడే కొన్ని రకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పదార్థాలను చూస్తూ ముందుకు వంగి చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుని తిరిగి సాధారణ స్థితికి వచ్చినప్పుడు కడుపులో జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల నోట్లో అధికంగా ఊరే లాలాజలం కూడా జతచేరడంతో జీర్ణక్రియ వేగవంతమవుతుంది. కడుపులో జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
నేలమీద కూర్చుని తినడం వల్ల నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. దీంతో ఎంత ఆహారం తీసుకోవాలన్నది పొట్ట నుంచి మెదడుకు వేగంగా సంకేతమందుతుంది. పరిమితికి మించి తినకపోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది.
నేలపై కూర్చుని తినడం వల్ల గుండె నుంచి కింది భాగాలకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దీంతో జీవక్రియలు మెరుగుపడతాయి. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్లకు ఎక్కువ రక్తం వెళ్తుంది.
నేలపై కూర్చుని తినడం వల్ల వెన్నెముక నిటారుగా మారుతుంది. భుజాలు వంగిపోవు. మెడ నొప్పి రాదు. దీనివల్ల నడుము, మెడనొప్పి సమస్యలు తగ్గుతాయి.
కాళ్లు మడిచి కూర్చోవడం వల్ల కటి ప్రాంతం, మోకాళ్లు, మడమల్లోని కండరాలు సాగి శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
కింద కూర్చుని తినడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు