Share News

దినుసుల్లో ఏముంది?

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:36 AM

జీలకర్ర, దాల్చినచెక్క మొదలైన సుగంధ ద్రవ్యాల్లోని ఆరోగ్య విలువల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. మసాలా దినుసులు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే....

దినుసుల్లో ఏముంది?

జీలకర్ర, దాల్చినచెక్క మొదలైన సుగంధ ద్రవ్యాల్లోని ఆరోగ్య విలువల గురించి మనకు అంతగా అవగాహన ఉండదు. మసాలా దినుసులు అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే....

నల్ల మిరియాలు: జీర్ణ సంబంధ సమస్యలకు నల్ల మిరియాలు చక్కని విరుగుడు. వీటిలో ఉండే పెపరీన్‌ కొవ్వును కరిగిస్తుంది. కొత్తగా కొవ్వు కణాలు ఏర్పడకుండా నియంత్రిస్తుంది.

జీలకర్ర: వీటితో మొలల సమస్య తగ్గుతుంది. మతిమరుపు, నిద్రలేమి, రక్తహీనతలు కూడా తొలగిపోతాయి. భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత జీలకర్రను తినడం వల్ల రక్తశుద్ధి జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

అల్లం: అల్లానికి కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. కాబట్టి పరగడుపున వేడి నీళ్లతో అల్లం రసం కలిపి తీసుకుంటే స్థూలకాయం రాకుండా ఉంటుంది.

పసుపు: దీన్లోని కర్‌క్యుమిన్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను కలిగి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

Updated Date - Sep 29 , 2026 | 03:37 AM