యాలకులు తింటున్నారా..
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:03 AM
భోజనం తరువాత ఒకట్రెండు యాలకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
భోజనం తరువాత ఒకట్రెండు యాలకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
యాలకుల్లో జీర్ణక్రియను వేగవంతం చేసే ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి మనం తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం, కడుపులో ఆమ్లత్వంలాంటి సమస్యలు దరిచేరవు. కడుపులో తేలికగా ఉన్న భావన కలుగుతుంది
యాలకులను నమిలినప్పుడు వాటిలోని సుగంధ తైలాలు మౌత్ ఫ్రెషనర్‌లా పనిచేస్తాయి. దీంతో నోటి దుర్వాసన తొలగిపోతుంది. యాలకుల్లోని యాంటీ మైక్రోబియల్ గుణాలు ప్రభావవంతంగా పనిచేసి దంత క్షయం, చిగుళ్ల వాపు లాంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.
రాత్రి పడుకునేముందు రెండు యాలకులను నెమ్మదిగా నములుతూ ఉంటే వాటి నుంచి వచ్చే సువాసనకు ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. శారీరక అలసట తీరి హాయిగా నిద్ర ముంచుకొస్తుంది.
వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ తదితర సమస్యలను నివారించడంలో యాలకులు ఔషధ పాత్ర పోషిస్తాయి. తరచూ యాలకులు నమలడం వల్ల శ్వాసకోశ మార్గాల్లోని అడ్డంకులు తొలగి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా పనిచేస్తాయి.
యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అంతర్గత కణాలను కాపాడడంతోపాటు ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు తలెత్తకుండా చేస్తాయి.
యాలకులు... సహజ మూత్ర విసర్జనను ప్రేరేపిస్తాయి. దీని ద్వారా శరీరంలోని వ్యర్థాలు, అధిక సోడియం, గుండె చుట్టూ చేరిన అదనపు ద్రవాలు సులువుగా బయటికి వెళతాయి. మూత్రపిండాలు, మూత్ర నాళం ఆరోగ్యంగా పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!