Share News

హ్యాపీ హార్మోన్ల కోసం...

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:39 AM

ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉండేందుకు డోపమైన్‌, సెరటోనిన్‌, ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ అనే హ్యాపీ హార్మోన్లు తోడ్పడతాయి. శరీరంలో వీటి స్థాయిని పెంచేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో...

హ్యాపీ హార్మోన్ల కోసం...

ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉండేందుకు డోపమైన్‌, సెరటోనిన్‌, ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ అనే హ్యాపీ హార్మోన్లు తోడ్పడతాయి. శరీరంలో వీటి స్థాయిని పెంచేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం...

  • బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, వాల్‌నట్స్‌ను తరచూ తింటూ ఉంటే వాటిలోని మెగ్నీషియం, ట్రిఫ్టోఫాన్‌ కలిసి శరీరంలో సెరటోనిన్‌ స్థాయి పెరగడంతో మనసు అహ్లాదకరంగా అనిపిస్తుంది.

  • రోజుకు రెండు కోడిగుడ్లు తింటూ ఉంటే వాటిలోని ప్రోటీన్‌, అమైనో ఆమ్లాలు కలిసి మెదడులో డోపమైన్‌, సెరటోనిన్‌ల ఉత్పత్తిని పెంచుతాయి.

  • పాలకూరలో ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో హ్యాపీ హార్మోన్ల స్థాయిని పెంచుతాయి. పాలకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది.

  • అరటి పండులో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందించడంతోపాటు హాయిగా నిద్ర వచ్చేలా చేస్తాయి. దీంతో శరీరానికి అలసట తగ్గి ఉత్సాహంగా అనిపిస్తుంది. అలాగే కంది పప్పు, పెసరపప్పు, రాజ్మా, చిక్కుళ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

  • రెండు రోజులకోసారి డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అలాగే డోపమైన్‌ హార్మోన్‌ స్థాయి పెరుగుతుంది. దీంతో మనసులో సంతోషకరమైన భావన కలుగుతుంది.

  • సాల్మోనా, ట్యూనా, మాకరెల్‌, సార్డైన్‌ లాంటి చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ఇవి మెదడు పనితీరుని మెరుగుపరిచి హ్యాపీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో మానసిక అలజడి తగ్గుతుంది.

  • రోజూ భోజనంలో పెరుగు లేదా మజ్జిగను చేర్చుకుంటే మెదడులో సెరటోనిన్‌ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్య తీరడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

Updated Date - Jul 02 , 2026 | 03:39 AM