Share News

అరచేతులు మృదువుగా ఇలా...

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:28 AM

కడగడం, తుడవడం లాంటి రకరకాల ఇంటి పనుల కారణంగా పొడిబారి గరుకుగా మారిన అరచేతులను మృదువుగా మార్చే చిట్కాలివే...

అరచేతులు మృదువుగా ఇలా...

కడగడం, తుడవడం లాంటి రకరకాల ఇంటి పనుల కారణంగా పొడిబారి గరుకుగా మారిన అరచేతులను మృదువుగా మార్చే చిట్కాలివే...

  • గిన్నెలు కడగడం, దుస్తులు ఉతకడం, ఇల్లు తుడవడం లాంటి పనులు చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. వీటివల్ల డిటర్జెంట్లు, క్లీనింగ్‌ లిక్విడ్‌లలోని రసాయనాల నుంచి చేతులకు రక్షణ లభిస్తుంది.

  • పనులు పూర్తి చేసిన తరువాత అరచేతులకు మాయిశ్చరైజర్‌ లేదా హ్యాండ్‌ క్రీమ్‌ రాసుకోవాలి.

  • చిన్న గిన్నెలో చెంచా కలబంద గుజ్జును తీసుకుని అందులో చెంచా కొబ్బరినూనె లేదా బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు అరచేతులకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • గిన్నెలో రెండు చెంచాల చక్కెర, చెంచా తేనె వేసి కలపాలి. దీన్ని అరచేతులకు పట్టించి మెల్లగా మర్దన చేసి ఆపైన మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల మృతకణాలు, మురికి తొలగి అరచేతులు మృదువుగా మరుతాయి. ఓట్‌మీల్‌ స్క్రబ్‌ కూడా మంచి ఫలితాన్నిస్తుంది.

  • అర చేతులకు కొద్దిగా పెరుగును పట్టించి పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తేమతో నిండి సమస్య తీరుతుంది.

  • అరచేతులను శుభ్రం చేసుకోవడానికి తరచూ శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌లు, సబ్బులు వాడకూడదు. వీటికి బదులు కుంకుడుకాయ రసం, సున్నిపిండి లాంటివి వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. గ్లిసరిన్‌ లేదా షియా బటర్‌తో కూడిన హ్యాండ్‌ వాష్‌లు, బేబీ సోప్‌లు వాడడం మంచిది.

ఇవి కూడా చదవండి:

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

Updated Date - Jun 03 , 2026 | 05:28 AM