Share News

శిరోజాల కోసం సింపుల్‌గా...

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:51 AM

శిరోజాలు రాలడం, వాటి చివర్లు చిట్లడం లాంటి సమస్యల నివారణ కోసం సాఽధారణ చిట్కాలు...

శిరోజాల కోసం సింపుల్‌గా...

శిరోజాలు రాలడం, వాటి చివర్లు చిట్లడం లాంటి సమస్యల నివారణ కోసం సాఽధారణ చిట్కాలు...

  • తాజా కొబ్బరి నూనె లేదా ఆల్మండ్‌ ఆయిల్‌ను గోరువెచ్చగా వేడిచేసి కుదుళ్లకు పట్టించి మాడుమీద మెల్లగా మర్దన చేస్తే శిరోజాలు రాలడం తగ్గడమే కాకుండా అవి నల్లగా నిగనిగలాడతాయి.

  • ఎర్ర ఉల్లిపాయ పేస్టును మాడుకు పట్టించి పది నిమిషాల తరువాత తలస్నానం చేస్తే చాలావరకు శిరోజాల సమస్యలు తీరుతాయి.

  • మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా రుబ్బి తలకు పట్టించి ఆపైన గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే తగినంత తేమ అంది శిరోజాలు మృదువుగా నల్లగా మెరుస్తాయి.

  • బియ్యం కడిగిన నీళ్లను రోజూ శిరోజాలపై స్ర్పే చేసుకుంటుంటే వాటి చివర్లు చిట్లకుండా ఉంటాయి.

  • ఆవనూనెలో కరివేపాకునువేసి బాగా మరిగించి ఆపైన వడబోసి తలకు రాసుకుంటుంటే శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. గతంలో ప్రతి మహిళ పాటించిన చిట్కా ఇది.

  • మందారం ఆకులు, పూలను మెత్తగా నూరి హెయిర్‌ మాస్క్‌లా అప్లయ్‌ చేస్తే శిరోజలకు పోషణ లభిస్తుంది.

  • రెండు చెంచాల కొబ్బరి నూనెలో నాలుగు చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌ వేసి బాగా కలిపి కొద్దిగా వేడిచేయాలి. ఆపైన తలకు పట్టించి అయిదు నిమిషాలు మర్దన చేసి పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే కుదుళ్లు బలపడతాయి. శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 04:51 AM