Share News

గురివింద ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:15 AM

గురివింద గింజలు విషపూరితమైనవి కానీ ఆకులు మాత్రం ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. చింత లేదా ఉసిరి ఆకుల మాదిరి చిన్నగా మృదువుగా ఉండే ఈ గురివింద ఆకులు అందించే ఆరోగ్య ప్రయోజనాలివే...

గురివింద ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

గురివింద గింజలు విషపూరితమైనవి కానీ ఆకులు మాత్రం ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. చింత లేదా ఉసిరి ఆకుల మాదిరి చిన్నగా మృదువుగా ఉండే ఈ గురివింద ఆకులు అందించే ఆరోగ్య ప్రయోజనాలివే...

శిరోజాలకు...

రెండు గుప్పెళ్ల గురివింద ఆకులను శుభ్రంగా కడిగి మెత్తటి పేస్టులా చేయాలి. స్టవ్‌ మీద గిన్నెపెట్టి కప్పు నువ్వుల నూనె పోసి గురివింద ఆకుల పేస్టు వేసి కలుపుతూ మరిగించాలి. ఆపైన చల్లార్చి సీసాలోకి వడబోయాలి. ఈ నూనెను రోజూ రాత్రిపూట పడుకునేముందు తలకు రాసుకుంటే శిరోజాలు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతాయి చుండ్రు, పేలు తొలగిపోతాయి. పేనుకొరుకుడు సమస్యతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది.

వాపులు, నొప్పులకు...

మరుగుతున్న నీటిలో గురివింద ఆకులు వేసి పది నిముషాలు ఉడికించాలి. ఆపైన వడబోసి గోరువెచ్చగా చల్లార్చి నోట్లో పోసుకుని పుక్కిలిస్తే చిగుళ్ల వాపు, నోటిలో పుండ్లు, నాలుక పూత, నోటి దుర్వాసన, పంటి నొప్పి, స్వరపేటిక వాపు, గొంతు నొప్పి తదితరాలు తగ్గుతాయి. చలికి కీళ్లు, ఎముకలు పట్టేసినా; శరీరంలో ఎక్కడైనా వాపులు కనిపించినా ఆ భాగాల్లో.. ఆముదం రాసిన గురివింద ఆకులను కొద్దిగా వేడిచేసి వాటితో కట్టుకడితే సమస్య తీరుతుంది.

ఇతర సమస్యలకు...

గురివింద ఆకుల రసాన్ని రాసి కొద్దిసేపు ఎండ తగిలేలా చేస్తే బొల్లిమచ్చలు తగ్గుతాయి. చెవి నొప్పి వేధిస్తుంటే రెండు చుక్కల రసాన్ని చెవిలో వేస్తే ప్రయోజనం ఉంటుంది. దురద, దద్దుర్లు, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక గాయాలు మానేందుకు ఈ ఆకుల పసరును చర్మంపై పూతలా రాస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 06:15 AM