ఆహారం ఆరోగ్యం
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:34 AM
మనం రోజూ పలు రకాల పదార్థాలు తింటూ ఉంటాం. కానీ వాటిలో పోషకాల పరిమాణాల గురించి మనకు తెలిసింది ఎంతో తక్కువ. వాటి గురించి...
ఇదీ సంగతి
మనం రోజూ పలు రకాల పదార్థాలు తింటూ ఉంటాం. కానీ వాటిలో పోషకాల పరిమాణాల గురించి మనకు తెలిసింది ఎంతో తక్కువ. వాటి గురించి తెలుసుకుందామా?
రెండు గుడ్లు: రోజుకు రెండు గుడ్లు తింటే, 30 నిమిషాల సూర్యస్నానంతో దక్కే విటమిన్‌డితో సమాన పరిమాణాన్ని పొందగలుగుతాం!
బాదం: గుప్పెడు బాదం పప్పుతో రెండు గ్లాసుల చిక్కని పాలతో పొందే సమాన క్యాల్షియంను పొందగలుగుతాం!
కివి: ఒక నారింజ పండులో ఉండేంత విటమిన్ సి ఒక కివి పండులో కూడా ఉంటుంది
పాలకూర: అర కప్పు మాంసంతో పొందే ఐరన్‌ను ఒక కప్పుడు పాలకూరతో కూడా పొందవచ్చు
బ్రేజిల్‌నట్: మూడు బ్రేజిల్ నట్స్‌తో, రోజుకు సరిపడా సెలీనియం అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ను పొందవచ్చు
అవకాడొ: ఒక అరటిపండు కంటే అర అవకాడొలో ఎక్కువ పొటాషియం ఉంటుంది
అవిసె గింజలు: మూడు టేబుల్‌స్పూన్ల అవిసె గింజల్లో, అంతే పరిమాణంలోని చేపల్లో కంటే ఎక్కువ ఒమేగా 3 ఆమ్లాలుంటాయి
చిలగడదుంప: ఒక చిలగడ దుంపలో రోజుకు సరిపడా విటమిన్‌ఎ ఉంటుంది
డార్క్ చాక్లెట్: 70% కంటే ఎక్కువ డార్క్ చాక్లెట్‌లో ఒక చిన్న సప్లిమెంట్‌కు మించి మెగ్నీషియం ఉంటుంది.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!