ఇన్‌ఫెక్షన్లతో క్యాన్సర్లు
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:01 AM
పలు రకాల క్యాన్సర్లను నియంత్రించే వీలుంది. మరీ ముఖ్యంగా ఐదు రకాల ఇన్‌ఫెక్షనతో ఏకంగా 20 లక్షల మంది క్యాన్సర్ బారిన...
క్యాన్సర్ కేర్
పలు రకాల క్యాన్సర్లను నియంత్రించే వీలుంది. మరీ ముఖ్యంగా ఐదు రకాల ఇన్‌ఫెక్షనతో ఏకంగా 20 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉంటారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఆ ఐదు ఇన్‌ఫెక్షన్ల గురించి అవగాహన పెంచుకోవడం అత్యవసరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ ఏజెన్సీ తాజాగా చేపట్టిన ఒక అధ్యయనంలో, ప్రపంచవ్యాప్తంగా నిర్థారణ అయ్యే ప్రతి 8 క్యాన్సర్లలో ఒక క్యాన్సర్‌ను నియంత్రించే వీలుందని రుజువైంది. 2024లో వెలుగులోకొచ్చిన 2ు కొత్త క్యాన్సర్ కేసుల్లో 23 లక్షల కేసులకు ప్రధాన కారకాలు వ్యాధికారక సూక్ష్మజీవులేనని నిర్థారణ అయింది. క్యాన్సర్ ప్రధాన కారకాలైన ధూమపానం, మద్యపానం, పర్యావరణ కాలుష్యాలకు భిన్నంగా వ్యాధికారక సూక్ష్మజీవుల వల్ల కూడా క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. ఈ వ్యాధుల బారిన పడినవాళ్లు సదరు వ్యాధులకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లకు, వ్యాధి నిర్థారణ పరీక్షలకు దూరంగా ఉండడంతో పాటు వైద్య చికిత్సలను ఆలస్యం చేయడమే ఇందుకు కారణం. క్యాన్సర్ కారక ఇన్‌ఫెక్షన్ల జాబితాలో హెలికోబ్యాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా మొదటి స్థానంలో ఉంది. ఈ బ్యాక్టీరియాతో గ్యాస్టిక్ క్యాన్సర్ సోకుతోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కారక హ్యూమన్ పాపిలోమా వైరస్ జాబితాలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తోంది. అలాగే హెపటైటిస్ బి, హెపైటిస్ సి వైరస్ ఇన్‌ఫెక్షన్లు కూడా కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. ఇలాంటి ఇన్‌ఫెక్షన్ కారక క్యాన్సర్లకు అడ్డుకట్ట వేయాలంటే సదరు ఇన్‌ఫెక్షన్లను అడ్డుకునే వ్యాక్సిన్లు, వైద్య పరీక్షలు, చికిత్సలను ఆశ్రయించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..