వ్యాయామానికి ముందు, తర్వాత...
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:40 AM
వ్యాయామంతో పాటు దానికి ముందు, తర్వాత అనుసరించే వార్మప్, కూల్‌డౌన్ కూడా ముఖ్యమే!...
వర్కవుట్
వ్యాయామంతో పాటు దానికి ముందు, తర్వాత అనుసరించే వార్మప్, కూల్‌డౌన్ కూడా ముఖ్యమే!
60 నిమిషాల వ్యాయామంలో మొదటి పది నిమిషాలు వార్మప్‌కూ, చివరి పది నిమిషాలు కూల్ డౌన్‌కూ కేటాయించాలి. వార్మప్‌తో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు వ్యాయామానికి సిద్ధపడతాయి. కూల్‌డౌన్‌తో తర్వాతి సెషన్‌కు తగ్గట్టు శరీరం కోలుకుంటుంది. ఈ రెండు పనులను మానేస్తే, వ్యాయామం మన శరీరాన్ని బలపరచడానికి బదులుగా దాని మీదే దాడి చేయడం మొదలుపెడుతుంది. ఈ వార్మప్, కూల్‌డౌన్‌లను మినహాయిస్తూ ఏళ్ల తరబడి పరుగుల్లో పాల్గొనే అథ్లెట్లు, రన్నర్లు 40 ఏళ్లకే గాయాలపాలవుతూ, 50 ఏళ్లకు ఆ క్రీడ నుంచి విరమించుకుంటూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామానికి ముందు, చివర వార్మప్, కూల్‌డౌన్‌లను నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ వార్తలనూ చదవండి:
అంతరిక్ష రంగంలో చైనా మరో అద్భుతం.. కేవలం 2 రోజుల్లో..
హౌతీలపై దాడికి అమెరికా రెడీ.. చివరి నిమిషంలో ట్రంప్ యూటర్న్..