వ్యాయామంతో వృద్ధాప్యం?
ABN , Publish Date - Oct 06 , 2026 | 05:34 AM
యవ్వనంగా కనిపించడం కోసం చురుగ్గా మారడం కోసం వ్యాయామం చేస్తాం! కానీ వ్యాయామం చేయడంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల పూర్తి భిన్నమైన ఫలితం దక్కే ప్రమాదం ఉంది. మరిన్ని వివరాలు...
మీకు తెలుసా?
యవ్వనంగా కనిపించడం కోసం చురుగ్గా మారడం కోసం వ్యాయామం చేస్తాం! కానీ వ్యాయామం చేయడంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల పూర్తి భిన్నమైన ఫలితం దక్కే ప్రమాదం ఉంది. మరిన్ని వివరాలు...
వ్యాయామ ఫలం విశ్రాంత సమయంలో దక్కుతుంది. వ్యాయామం చేయడంతో పాటు సరిపడా విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరమే! కానీ కొందరు దైనందిన జీవితాన్ని అస్తవ్యస్థంగా గడిపేస్తూ, వ్యాయామంతో ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ పెంచుకోవచ్చని భ్రమ పడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఇందుకు పూర్తి విరుద్ధం! సరిపడా నిద్ర, ఆహారం లేకుండా ప్రతి రోజూ గంటల తరబడి, అత్యంత శ్రమతో కూడిన కార్డియో చేయడం వల్ల శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. సరిపడా విశ్రాంతి తీసుకోని రోజులు, 5 గంటల కంటే తక్కువ సమయం పాటు నిద్రపోయిన రోజుల్లో వ్యాయామం చేయడం వల్ల శరీరానికి మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. కొందరు కార్డియోకే మొగ్గు చూపుతూ ఉంటారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవసరం లేదనుకుంటారు. కానీ నిజానికి మన కండరాలే మన మెటబాలిజం ఇంజన్లు. 30 ఏళ్ల నుంచి కండర క్షీణత వేగంపుంజుకుంటుంది. కాబట్టి ఆ వయసు నుంచి బరువులతో వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అలాగే కొందరు యుక్తవయస్కుల వ్యాయామాలతో పోటీ పడాలనుకుంటారు. కానీ శరీరం కోలుకునే సామర్థ్యం ఆధారంగా వ్యాయామాలను ఎంచుకోవాలి. నిద్ర పట్టకపోవడం, హుషారు తగ్గడం, రోజంతా ఒళ్లు నొప్పులు, తరచూ రుగ్మతల బారిన పడుతూ ఉండడం అతి వ్యాయామానికి సూచనలు. కాబట్టి వారంలో రెండు నుంచి మూడు రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూ, ప్రతి రోజూ నడుస్తూ ఉండాలి. కంటి నిండా నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..