Share News

సన్‌ ట్యాన్‌ మాయం ఇలా..!

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:38 AM

ఎండాకాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య సన్‌ ట్యాన్‌. దీనివల్ల ముఖం, మెడ, చేతులు నల్లగా మారి నిర్జీవంగా కనిపిస్తుంటాయి. ఈ ట్యాన్‌ను...

సన్‌ ట్యాన్‌ మాయం ఇలా..!

ఎండాకాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య సన్‌ ట్యాన్‌. దీనివల్ల ముఖం, మెడ, చేతులు నల్లగా మారి నిర్జీవంగా కనిపిస్తుంటాయి. ఈ ట్యాన్‌ను సులభంగా తొలగించి చర్మాన్ని తాజాగా మెరిపించే చిట్కాలివే...

  • చెంచా తేనెలో రెండు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చూపుడు వేలితో ముఖానికి, మెడకు పట్టించి పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. నిమ్మరసం బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేసి ట్యాన్‌ని తొలగిస్తుంది.

  • పావు కప్పు పెరుగులో చెంచా పసుపు వేసి క్రీమ్‌లా మారే వరకు చెంచాతో కలపాలి. దీన్ని ట్యాన్‌ ఏర్పడిన భాగాలపై అప్లయ్‌ చేసి అరగంటసేపు ఉంచాలి. తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

  • రాత్రి పడుకునేముందు టమాటా గుజ్జు లేదా కలబంద గుజ్జును ముఖానికి, చేతులకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే చర్మం నిగారిస్తుంది.

  • ట్యాన్‌ ఏర్పడిన చోట బంగాళదుంప రసం రాసినా, బాదం పేస్టు పట్టించినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవి చర్మం పై పొరను బ్లీచ్‌ చేసి నలుపుదనాన్ని మాయం చేస్తాయి.

  • అర కప్పు పెరుగులో రెండు చెంచాల ఓట్స్‌ పొడి వేసి ముఖానికి, మెడకు ప్యాక్‌లా పట్టించాలి. చేతివేళ్లతో వలయాకారంలో సున్నితంగా రుద్దుతూ ప్యాక్‌ను తొలగించాలి. దీనివల్ల చర్మంపై పేరుకున్న మృత కణాలు, మురికి, ట్యాన్‌ తొలగిపోతాయి. రక్తప్రసరణ మెరుగుపడి చర్మం ఛాయగా మెరుస్తుంది.

  • బయటి నుంచి ఇంట్లోకి రాగానే ముఖాన్ని శుభ్రం చేసుకుని గులాబీ నీళ్లను స్ర్పే చేసుకుంటే ట్యాన్‌ తొలగి చర్మం తేమతో నిండుతుంది.

ఇవి కూడా చదవండి:

వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

Updated Date - Feb 28 , 2026 | 12:39 AM