Share News

వేసవిలో హాయిగా నిద్రపట్టాలంటే...

ABN , Publish Date - May 18 , 2026 | 05:13 AM

ఎండాకాలంలో ఉక్కపోత వల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. అలాగని చల్లదనం కోసం గంటలకొద్దీ ఏసీ వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏసీ, కూలర్‌ లేకపోయినా...

వేసవిలో హాయిగా నిద్రపట్టాలంటే...

ఎండాకాలంలో ఉక్కపోత వల్ల రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. అలాగని చల్లదనం కోసం గంటలకొద్దీ ఏసీ వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఏసీ, కూలర్‌ లేకపోయినా రాత్రంతా హాయిగా నిద్రపట్టాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి...

  • వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. దీన్ని నియంత్రించడానికి ఎక్కుగా శక్తి ఖర్చవుతుంది. దీంతో శరీరం త్వరగా అలసిపోయి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ పగటిపూట ఎక్కువగా నిద్రపోకపోవడమే మంచిది. దీనివల్ల రాత్రి పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది.

  • వాతావరణం వేడిగా ఉన్నాకూడా రోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం చేస్తూ ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

  • ఉదయాన్నే తలుపులన్నీ తెరచి ఉంచితే ఇంట్లోకి గాలి ధారాళంగా వీచి గదుల్లో వేడిని తగ్గిస్తుంది. ఎండ పెరుగుతున్న సమయంలో కిటికీలు మూసేసి కర్టెన్లు వేస్తే ఇల్లు వేడెక్కకుండా ఉంటుంది. మరల రాత్రి పడుకునేముందు కిటికీలు తెరిస్తే హాయిగా నిద్రపడుతుంది.

  • పరుపుల మీద పలుచని కాటన్‌ దుప్పట్లు వేయాలి. ఇవి ఎక్కువగా వేడిని గ్రహించవు. శరీరంపై ఏర్పడే చెమటను త్వరగా పీల్చుకుని చికాకు లేకుండా చేస్తాయి. దీంతో పడుకున్న కాసేపటికే మంచి నిద్ర పడుతుంది.

  • పడుకునేముందు ఫ్యాన్‌ వేసుకుంటే చెమట అవిరై శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది. ఫ్యాన్‌ గాలికి బయటి నుంచి వచ్చే చల్లటి గాలి తోడవడంతో వెంటనే నిద్ర పడుతుంది.

  • కాళ్లు చల్లగా ఉంటే శరీర ఉష్ణోగ్రత పెరగదు. కాబట్టి సాక్స్‌ను అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి పాదాలకు వేసుకుంటే చల్లటి అనుభూతి కలిగి నిద్రపోవాలనిపిస్తుంది.

  • వేడిగా ఉందంటూ మరీ చల్లటి నీటితో స్నానం చేయకూడదు. దానివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి చికాకుగా అనిపిస్తుంది. సరిగా నిద్రపట్టదు. సాయంత్రం లేదా రాత్రి పడుకునేముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 05:13 AM