ఇంట్లోనే పెడిక్యూర్ ఇలా...
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:49 AM
కాళ్ల పగుళ్లను నివారించి పాదాల నలుపుదనాన్ని వదిలించే పెడిక్యూర్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం...
కాళ్ల పగుళ్లను నివారించి పాదాల నలుపుదనాన్ని వదిలించే పెడిక్యూర్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం...
ముందుగా నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకోవాలి. సబ్బు లేదా షాంపూతో పాదాలను రుద్ది కడగాలి.
తరువాత వెడల్పాటి టబ్‌లో సగానికి పైగా గోరువెచ్చటి నీళ్లు పోసి అందులో రెండు చెంచాల ఉప్పు, మూడు చెంచాల నిమ్మరసం, గుప్పెడు గులాబీ రేకులు వేసి బాగా కలపాలి. ఈ నీటిలో పాదాలు ఉంచి అరగంటసేపు నాననివ్వాలి.
తరువాత స్క్రబ్బర్ లేదా ప్యూమిన్ స్టోన్‌తో పాదాలను మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పాదాలమీద పేరుకున్న మృతకణాలు, మురికి తొలగిపోతాయి.
ఆపైన చెంచా చక్కెరలో చెంచా కాఫీ పొడి, అర చెంచా కొబ్బరి నూనె కలిపిన మిశ్రమంతో పాదాలమీద మర్దన చేయాలి. దీనివల్ల పాదాలకు రక్తప్రసరణ పెరుగుతుంది.
తరువాత గోళ్లను కత్తిరించి ట్రిమ్ చేయాలి. ఆపైన చల్లటి నీళ్లతో లేదా ఐస్ క్యూబ్స్‌తో పాదాలను మరోసారి శుభ్రం చేసుకోవాలి. తరువాత పలుచని తువాలు లేదా రుమాలుతో పాదాలను పొడిగా తుడవాలి.
చివరగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను చేత్తో తీసుకుని పాదాలకు పట్టిస్తూ మెల్లగా నొక్కుతూ ఉండాలి. దీనివల్ల పాదాల్లో రక్తప్రసరణ పెరగడమే కాదు కాళ్ల పగుళ్లు తగ్గిపోతాయి. తగినంత తేమ చేకూరి పాదాలు మృదువుగా కాంతివంతంగా మారతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు
రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా
For More AP News And Telugu News