Share News

చిటికెలో శుభ్రం ఇలా...

ABN , Publish Date - May 18 , 2026 | 05:09 AM

వంటగదిని అందులోని ఉపకరణాలను తక్కువ సమయంలో సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

చిటికెలో శుభ్రం ఇలా...

వంటగదిని అందులోని ఉపకరణాలను తక్కువ సమయంలో సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

  • గిన్నెలు తోమిన తరువాత సింక్‌లో చెంచా బేకింగ్‌ సోడా చల్లి నిమ్మ చెక్కతో రుద్దితే మురికి, దుర్వాసన తొలగిపోతాయి. బొద్దింకలు లాంటి కీటకాలు చేరవు. స్టీల్‌ సింక్‌కు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

  • టూత్‌పేస్టు రాసిన పాత బ్రష్‌తో సింక్‌లోని పంపులను రుద్ది కడిగితే నీటి మరకలు తొలగి అవి కొత్తగా మెరుస్తాయి.

  • వంట పాత్రలను తోమేముందు వాటి నిండా నీళ్లు పోసి కొద్దిసేపు నానబెడితే జిడ్డు, మాడు మరకలు త్వరగా వదులుతాయి. పని సులువుగా పూర్తవుతుంది.

  • వంటగదిలో ఉంచే డస్ట్‌బిన్‌లో కొద్దిగా బేకింగ్‌ సోడా, వాడేసిన నిమ్మ తొక్కలు వేస్తే దుర్వాసన రాదు. దీన్ని రోజూ ఖాళీ చేస్తూ ఉండాలి.

  • వారానికి ఒకసారి ఫ్రిజ్‌ను డీప్‌ క్లీనింగ్‌ చేయాలి. వెజిటబుల్‌ బాస్కెట్‌, ట్రేలు, ఫ్రీజర్‌ బాక్స్‌, డోర్‌లోపలి అరలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటే ఫ్రిజ్‌ నుంచి దుర్వాసన రాదు. అది చాలా రోజులు మన్నికగా ఉంటుంది.

  • బ్లెండర్‌, మిక్సీ గిన్నెలను వాడిన తరువాత వాటిలో ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిని పోసి అర నిమిషంపాటు బ్లెండ్‌ లేదా గ్రైండ్‌ చేయాలి. వాటిలో ఇరుక్కున్న ఆహార పదార్థాలన్నీ బయటికి వచ్చేస్తాయి. తరువాత లిక్విడ్‌ డిటర్జెంట్‌తో తోమి మంచినీటితో కడిగేస్తే సరిపోతుంది.

  • రోజూ రాత్రి పడుకునేముందు స్టవ్‌ను పేపర్‌తో తుడవాలి. వారానికి ఒకసారి లిక్విడ్‌ డిటర్జెంట్‌తో తోమి జాగ్రత్తగా కడిగితే చాలు. బర్నర్‌ రంధ్రాల్లో పొడవాటి సూదితో గుచ్చి ఇరుక్కున్నవాటిని తొలగించాలి.

  • ఒక గిన్నెలో చెంచా బేకింగ్‌ సోడా, చెంచా లిక్విడ్‌ డిటర్జెంట్‌, కొన్ని వేడినీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వంటగది గట్టుపై చల్లి బ్రష్‌తో రుద్ది కడిగేస్తే అది శుభ్రంగా ఉంటుంది.

  • చిన్న గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసి అందులో చెంచా వెనిగర్‌ వేసి బాగా కలిపి ఓవెన్‌లో ఉంచాలి. అరగంటలో చెడు వాసనలు తొలగి ఓవెన్‌ తాజాగా మారుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్‌ కంపెనీగా టీసీఎస్‌

బంగారంలో పెట్టుబడులకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఈజీఆర్‌లు

Updated Date - May 18 , 2026 | 05:09 AM