టైల్స్ ఫ్లోర్ మెరిసేలా...
ABN , Publish Date - May 18 , 2026 | 05:05 AM
ఇంట్లో ఫ్లోర్ మీద ఉండే టైల్స్ తరచూ మురికిగా మారుతుంటాయి. వీటిని కొత్తవాటిలా మెరిపించే చిట్కాలివే...
ఇంట్లో ఫ్లోర్ మీద ఉండే టైల్స్ తరచూ మురికిగా మారుతుంటాయి. వీటిని కొత్తవాటిలా మెరిపించే చిట్కాలివే...
ప్రతి రెండు టైల్స్ మధ్య ఉండే ఖాళీ లైన్లలో దుమ్ము, ధూళి, జిడ్డు, ఇతర అవశేషాలు చేరి నల్లగా మారి ఫ్లోర్ అందాన్ని పాడు చేస్తుంటాయి. అలాంటప్పుడు ఈ లైన్ల మీద కొద్దిగా బేకింగ్ సోడా చల్లి దానిపై కొద్దిగా వెనిగర్‌ను చిలకరిస్తే బుడగలు వస్తాయి. పది నిమిషాల్లో మురికి మొత్తం కరిగిపోతుంది. పాత టూత్‌బ్రష్‌తో ఈ లైన్ల మీద రుద్ది ఆపైన నీటితో కడిగేస్తే ఫ్లోర్ తళతళా మెరుస్తుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మురికిగా ఉన్న టైల్స్ మీద రాసి పది నిమిషాలు నాననివ్వాలి. తరువాత బ్రష్‌తో రుద్ది తుడిచేస్తే టైల్స్ కొత్తవాటిలా మారతాయి.
టైల్స్‌పై మొండి మరకలు ఏర్పడినప్పుడు వాటిమీద కొద్దిగా టూత్‌పేస్ట్ రాసి బ్రష్‌తో తోమి ఆపైన పలుచని గుడ్డతో తుడిచేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. బాత్‌రూమ్ టైల్స్ మీద ఏర్పడే సబ్బు మరకలను తొలగించడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
ఒక బకెట్ నీటిలో రెండు చెంచాల బ్లీచింగ్ పౌడర్‌ను కలపాలి. ఈ నీటిని టైల్స్ ఫ్లోర్‌పై చల్లి పొడవాటి బ్రష్‌తో రుద్ది పదినిమిషాలు నాననివ్వాలి. తరువాత నీళ్లు పోసి కడిగేస్తే మురికి మొత్తం తొలగి ఫ్లోర్ కొత్తగా మెరుస్తుంది.
ఒక బకెట్ గోరువెచ్చటి నీటిలో రెండు చెంచాల తేలికపాటి డిటర్జెంట్ లేదా చెంచాన్నర వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ నీటితో రోజూ తుడుస్తుంటే మరకలు, మురికి తొలగి టైల్స్ ఫ్లోర్ శుభ్రంగా కనిపిస్తుంది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రపంచంలో అతిపెద్ద ఏఐ టెక్ కంపెనీగా టీసీఎస్
బంగారంలో పెట్టుబడులకు గోల్డ్ ఈటీఎఫ్, ఈజీఆర్‌లు