ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా?
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:25 AM
ఉదయం లేవగానే వేడివేడి కాఫీ లేదా టీతో రోజును ప్రారంభించడం మనలో చాలామందికి అలవాటు. అది లేకపోతే రోజంతా..
ఉదయం లేవగానే వేడివేడి కాఫీ లేదా టీతో రోజును ప్రారంభించడం మనలో చాలామందికి అలవాటు. అది లేకపోతే రోజంతా నీరసంగా అనిపిస్తుంది. అయితే, పరగడుపున కాఫీ తాగే అలవాటు శరీరానికి మేలు చేయడం కంటే ముప్పే ఎక్కువ తెచ్చిపెడుతుందంటున్నారు నిపుణులు.
మన శరీరంలో ఉదయాన్నే కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీనిని ‘స్ట్రెస్ హార్మోన్’ అంటారు. ఇది మనల్ని మేల్కొలిపి ఉత్సాహంగా ఉంచడానికి సాయపడుతుంది. సరిగ్గా అదే సమయంలో మనం కాఫీ ద్వారా కెఫిన్‌ను తీసుకుంటే, శరీరంలో కార్టిసాల్ స్థాయిలో తీవ్ర అసమతుల్యత ఏర్పడుతుంది. కాలక్రమేణ అది మానసిక ఒత్తిడి, ఆందోళన పెరగడానికి కారణమవుతుంది.
అంతేకాకుండా, ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇది జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఇవి కూడా చదవండి..
బాల్కనీ నుంచి కిందపడిన బాలుడు.. క్షణాల్లో స్పందించి కాపాడిన వ్యక్తి.. వీడియో వైరల్..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..