Share News

డబుల్‌ చిన్‌ తగ్గేదెలా..?

ABN , Publish Date - May 27 , 2026 | 03:31 AM

డబుల్‌ చిన్‌ వల్ల మెడతోపాటు ముఖ సౌందర్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యనుంచి సులువుగా తప్పించుకునే చిట్కాలివే..

డబుల్‌ చిన్‌ తగ్గేదెలా..?

డబుల్‌ చిన్‌ వల్ల మెడతోపాటు ముఖ సౌందర్యం కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యనుంచి సులువుగా తప్పించుకునే చిట్కాలివే..

  • తరచూ మంచినీళ్లు తాగుతూ ఉంటే చర్మం స్థితిస్థాపకత పెరుగుతుంది. దీంతో చర్మం సాగకుండా బిగుతుగా మారి డబుల్‌ చిన్‌ ఏర్పడకుండా చేస్తుంది.

  • జేడ్‌ రోలర్‌ సహాయంతో మెడ భాగంలో మసాజ్‌ చేస్తుంటే ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ పెరిగి డబుల్‌ చిన్‌ మాయమవుతుంది.

  • తరచూ షుగర్‌ ఫ్రీ చూయింగ్‌ గమ్‌ను నమలడం వల్ల దవడలకు మంచి వ్యాయామం లభిస్తుంది. అక్కడ అదనంగా పేరుకున్న కొవ్వులు కరిగి డబుల్‌ చిన్‌ తగ్గుతుంది.

  • తల వంచి మొబైల్‌ను ఎక్కువసేపు చూడడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. కళ్లకి ఎదురుగా ఫోన్‌ లేదా మొబైల్‌ను ఉంచి చూడడం మంచిది.

  • సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్‌ స్థాయి పెరుగుతుంది. దీంతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని అధికంగా కొవ్వులు ఉత్పత్తవుతాయి. ఈ క్రమంలో కూడా డబుల్‌ చిన్‌ ఏర్పడవచ్చు. కాబట్టి రోజూ కనీసం తొమ్మిది గంటలు నిద్రిస్తే డబుల్‌ చిన్‌ సమస్య దరిచేరదు.

  • వీలైనన్నిసార్లు మెడను పైకెత్తి సీలింగ్‌ను రెండు నిమిషాల తరువాత తల దించి నేలను చూస్తూ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖాన్ని గుండ్రంగా రెండు వైపులకూ తిప్పడం, మెడను అటూ ఇటూ తిప్పడం లాంటి వ్యాయామాలు చేస్తూ కూడా ఫలితం సాధించవచ్చు.

  • ప్రోటీన్లు, పీచులు అధికంగా లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, మొలకలు తింటూ సమస్యను అధిగమించవచ్చు. వేపుళ్లు, తీపి పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ తినడం పూర్తిగా మానేయాలి.

ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించా... కాంగ్రెస్ అధిష్టానం

చొరబాట్లతో అసహజ జనాభా మార్పుపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ.. అమిత్‌షా

Updated Date - May 27 , 2026 | 03:32 AM