Share News

దూదిలాంటి ఇడ్లీల కోసం

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:42 AM

అందరూ ఇష్టపడేలా ఇడ్లీ మెత్తగా దూదిలా రావడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి...

దూదిలాంటి ఇడ్లీల కోసం

అందరూ ఇష్టపడేలా ఇడ్లీ మెత్తగా దూదిలా రావడానికి ఈ చిట్కాలు పాటిస్తే సరి...

  • ఒక కప్పు మినపగుండ్లకు రెండున్నర కప్పుల ఇడ్లీరవ్వ లేదా రెండు కప్పుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకోవాలి.

  • ఉప్పుడు బియ్యం లేదా ఇడ్లీ రవ్వను నాలుగు గంటలు, మినపగుండ్లను రెండు గంటలు నానబెట్టాలి. అంతకంటే ఎక్కువ సమయం వాటిని నాననిస్తే అనుకున్నవిధంగా ఇడ్లీలు రావు.

  • మినపగుండ్లను నానబెట్టేటపుడు అందులో కొన్ని మెంతులు కూడా వేయాలి.

  • ఉప్పుడు బియ్యాన్ని కాస్త బరకగా గ్రైండ్‌ చేయాలి.

  • నానిన మినపగుండ్లను గ్రైండర్‌లో వేసేటప్పుడు చల్లటి నీళ్లు పోస్తే పిండి వేడెక్కకుండా మెత్తగా నురుగులా వస్తుంది. దీనిలో ఇడ్లీ రవ్వ వేసి చేత్తో కలిపితే పిండి బాగా పొంగి ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

  • కొన్ని అటుకులను అరగంటసేపు నీళ్లలో నానబెట్టి మెత్తగా గ్రైండ్‌ చేసి పిండిలో కలిపితే ఇడ్లీలు మృదువుగా రుచిగా తయారవుతాయి.

  • పిండిలో అయొడిన్‌ లేని రాతి ఉప్పును కలపడంవల్ల ఇడ్లీలు రుచిగా మృదువుగా వస్తాయి.

  • ఇడ్లీలు వేసేటప్పుడు పిండిని ఎక్కువగా కలపకూడదు. అలా కలిపితే ఇడ్లీలు పొంగడానికి అవసరమైన గాలి బుడగలు మాయమవుతాయి.

  • ఇడ్లీలను పది నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించకూడదు. స్టవ్‌ మీద నుంచి ఇడ్లీ కుక్కర్‌ను దించిన మూడు నిమిషాల తరువాతనే ఇడ్లీలను రేకులనుంచి పళ్లెంలోకి తీయాలి.

ఈ వార్తలనూ చదవండి:

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

యూపీలో ఎన్‌కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి

Updated Date - Jun 01 , 2026 | 12:42 AM